విజయవాడ

2018 నాటికి మచిలీపట్నం ఓడరేవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 1: 2018 నాటికి మచిలీపట్నం పోర్టు నిర్మాణాన్ని పూర్తిచేస్తామని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, బిసి సంక్షేమశాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. జలవనరులశాఖ కార్యాలయంలో గురువారం రాత్రి మచిలీపట్నం పోర్టు నిర్మాణంపై మంత్రులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ 2017 సంవత్సరం ప్రారంభంలో పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించి 2018 నాటికి పూర్తిచేసి ఓడను బందరు పోర్టుకు తీసుకువస్తామన్నారు. బందరు అభివృద్ధి, పోర్టు నిర్మాణాన్ని అడ్డుకోవడం ప్రతిపక్ష నాయకునికి తగదన్నారు. బందరు పోర్టుతో మచిలీపట్నంలో పచిలీపట్నం టౌన్‌షిప్ ఇండస్ట్రియల్ క్యారిడార్ అభివృద్ధి కానున్నదన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం భూములిచ్చిన రైతులకు ఇచ్చిన ప్యాకేజీ విధానానే్న మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు కూడా అమలుచేస్తున్నామని మంత్రి తెలిపారు. లక్ష ఎకరాలు మచిలీపట్నం పోర్టుకు సేకరిస్తున్నారన్న అసత్య ప్రచారం ప్రతిపక్ష నాయకులు చేస్తున్నారని, ఇది సత్యదూరమన్నారు. మడ అభివృద్ధికి బాధ్యత గల అధికారిని నియమించామన్నారు. ప్రతిరోజూ పార్లమెంటు సభ్యులు, స్థానిక మంత్రులు రైతులను కలుపుకొని పారదర్శకంగా ముందుకువెళుతుంటే ప్రతిపక్ష నాయకుడు ఓర్వలేక అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. అభివృద్ధికి సూచికగా అమరావతి సచివాలయమే అని నేడు క్యాబినెట్ తొలి సమావేశం కూడా అమరావతి రాజధానిలోనే నిర్వహించుకోవటం అభివృద్ధికి సూచిక కాదా అని మంత్రి అన్నారు. క్యాబినెట్ సమావేశంలో 3.5 లక్షల మంది పేదవారికి రానున్న జన్మభూమిలో పింఛన్లు అందజేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు. ప్రతిపక్ష నాయకులు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడాలే కాని, నిరోధకంగా మారకూడదన్నారు.
వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ బందరు పోర్టు నిర్మాణానికి రైతాంగం, ప్రభుత్వం కలిసి భూసేకరణ చేయటం జరిగిందని, దీనికోసం 14వేల ఎకరాల్లో పట్టా భూములు ఇవ్వగా, 5,200 ఎకరాలు ప్రభుత్వ భూమి పోర్టు నిర్మాణానికి అందజేయటం జరుగుతుందన్నారు. టౌన్‌షిప్ కొరకు 10వేల ఎకరాలు మిగిలిన భూమిని ఇండస్ట్రియల్ క్యారిడార్ కొరకు వినియోగించనున్నట్లు మంత్రి తెలిపారు. త్వరలో బందరు పోర్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. కోస్తా ప్రజల అభివృద్ధికి బందరు పోర్టు ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి అన్నారు.