విజయవాడ

జిల్లాకు పేరు ప్రఖ్యాతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 1: చౌక ధరల దుకాణాల్లో నగదు రహిత చెల్లింపు పద్ధతిని డీలర్లు సక్రమంగా నిర్వహించి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని కలెక్టర్ బాబు.ఎ కోరారు. గురువారం జిల్లా కలెక్టర్ బాబు.ఎ నగరంలోని క్రీస్తురాజపురం, గుణదల, ఆటోనగర్ ఎల్‌ఐజి కాలనీ, పెనమలూరు మండలం పోరంకిలోని చౌక ధరల దుకాణాల్లో నగదు రహిత చెల్లింపులను క్షేత్రస్థాయిలో పరిశీలించి డీలర్లకు పలు సూచనలు చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రేషన్ షాపులు, ఎరువులు, పింఛన్లు, వాణిజ్య సంస్థల్లో నగదు రహిత లావాదేవీలను దేశంలోనే పూర్తిస్థాయిలో నిర్వహిస్తున్న తొలి జిల్లాగా కృష్ణా నిలిపేలా కృషి చేయాలన్నారు. ఈ విధానంలో ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందులను తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. రేషన్ కార్డులు, ఆధార్, బ్యాంకు ఖాతాలకు తప్పనిసరిగా అనుసంధానం అయి వుండాలని అన్నారు. బ్యాంకు ఖాతాలు లేనివారి వివరాలు సేకరించి సమీపంలో గల బిజినెస్ కరస్పాండెంట్ ద్వారా వెంటనే ఖాతాలు ప్రారంభించాలన్నారు. నిత్యావసర వస్తువులు తీసుకున్న లబ్దిదారుని ఖాతా నుండి నేరుగా డీలరు ఖాతాకు జమ అవుతుందని ప్రక్రియ జరిగిన వెంటనే లబ్దిదారునికి ఏయే సరుకులు కొన్నారో అందుకు సంబంధించిన ధరల మొత్తం మెసేజ్ వస్తుందని కలెక్టర్ తెలిపారు.
ప్రతి నెలా ఇంటివద్దనే
వృద్ధాప్య పింఛన్లు
ప్రభుత్వం వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు అందిస్తున్న పెన్షన్లను బ్యాంకింగ్ కరస్పాండెంట్లు మైక్రో ఎటియంల ద్వారా వారి ఇంటి వద్దనే పెన్షన్లు అందించే విధానాన్ని పెనమలూరు మండలం పోరంకిలో కలెక్టర్ బాబు.ఎ, స్థానిక శాసనసభ్యులు బోడే ప్రసాద్ పరిశీలించారు. పోరంకి గ్రామాన్ని నగదు రహిత చెల్లింపులు నిర్వహిస్తున్న గ్రామంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ బాబు.ఎ కోరారు.