విజయవాడ

అమరావతి హెల్త్ కేర్ అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 1: నవ్యాంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో హెల్త్‌కేర్ రంగాన్ని అభివృద్ధికి విస్తృత చర్యలు తీసుకొంటున్నట్టు ఎపి సిఆర్‌డిఎ అదనపు కమిషనర్ వి రామమనోహరరావు పేర్కొన్నారు. గురువారం ఉదయం నగరంలోని ఎపిసిఆర్‌డిఎ కార్యాలయంలో 12 ప్రముఖ కార్పొరేట్ హాస్పటల్స్‌కు చెందిన ప్రతినిధులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమరావతి నగరాల్లో హాస్పటల్స్ ఏర్పాటుచేయాల్సిన ఆవశ్యకతపై ప్రతినిధులకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన రామమనోహరరావు రానున్న 10 సంవత్సరాల్లో 5వేల పడకల హాస్పటల్స్ అవసరమంటూ అంచనావేయడం జరిగిందన్నారు. ఈమేరకు హాస్పటల్స్ ఏర్పాటుపై సంస్థల ఆశక్తి, ఏర్పాటుకు ఎంతెంత భూమి అవసరం, ఏ పద్ధతిలో భూముల కేటాయింపు, 2018 నాటికి ఆపరేషన్ స్టేజ్ ఏమిటి, ప్రభుత్వం తరఫున కోరుకునే సహకారాలు, సంస్థల దశల వారీ ఆప్షన్లు ఏమిటన్న విషయాలపై హాస్పటల్స్ ప్రతినిధులతో చర్చించిన మీదట వారు సంతృప్తి వ్యక్తం చేస్తూ హాస్పటల్స్ ఏర్పాటుకు ఆశక్తి చూపుతూ సింగిల్ విండో విధానంలో ఆయా అనుమతులివ్వాలని, ప్రభుత్వం నుంచి తగిన సహకాలుంటే హెల్త్‌కేర్ పాలసీని సమర్ధవంతంగా అమలుచేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సూచనలను తమ హాస్పటల్స్ బోర్డులో చర్చించి తగిన ప్రతిపాదనలతో వస్తామన్నారు. ఈ సమావేశంలో అపోలో హాస్పటల్ సిఈవో డాక్టర్ సందీప్, కామినేని హాస్పటల్ సిఇవో డాక్టర్ శ్రీనివాస్, కిమ్స్ హాస్పటల్ కె గోవిందరాజన్, ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ ఎగ్జిక్యూటీవ్ విసి రామన్ ఆత్మకూరి, రెయిన్‌బో హాస్పటల్స్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ ఆర్ సుబ్బారావు, మణిపాల్ హాస్పిటల్ రీజనల్ హెడ్ టి మురళీరావు, హృదయాలయ గ్రూప్ హెడ్ దీపక్, వేణుగోపాలన్, నోరీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ నోరి సూర్యనారాయణ, మేనేజర్ ఐఎన్ పవన్, ఉషా కార్డియాక్ ఆస్పత్రి అధినేత డాక్టర్ వైవి రావు, న్యూరో జెన్ ఆస్పత్రి ప్రతినిధి ఎం రవికుమార్, నాగార్జున హాస్పిటల్ సిఇవో జి రామారావు, బొల్లినేని మెడి స్కిల్స్ హెడ్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సామాన్యుల కష్టాలు గట్టక్కించాలి

ఇంద్రకీలాద్రి, డిసెంబర్ 1: పెద్దనోట్ల రద్దు తర్వాత సామాన్య ప్రజలు పడుతున్న నానా ఇబ్బందులను ముఖ్యమంత్రి చంద్రబాబు భారత ప్రధాన మంత్రి మోదీ చూడాలని పిసిసి చీఫ్ యన్ రఘువీరారెడ్డి గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. బ్యాంకుల వద్ద క్యూలైన్లలో మరణించిన సుమారు 80మందికి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలన్నారు. కేంద్రం విడుదల చేసిన రూ. 2000 నోట్‌ను వెంటనే రద్దు చేసి రూ. 100, 50, నోట్లలను అన్ని బ్యాంకుల ఎటియంల్లో పెట్టి ఖాతాదారులకు అందుబాటులోనికి తీసుకురావాలన్నారు. నల్లకుబేరుల జాబితాను బయటకు తీసుకురావటంలో ఘోరంగా విఫలమైన మోదీ విఫలమైన కారణాలను దేశ ప్రజలను వివరించాలన్నారు. పెద్దనోట్ల రద్దు ప్రకటన, తర్వాత జరిగిన కుంభకోణాలపై సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తిచేత దర్యాప్తు చేయించాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు.

విజయవాడ (క్రైం), డిసెంబర్ 1: పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఇంకా ప్రజలపై కొనసాగుతోంది. నోట్ల కోసం బ్యాంకులు, ఏటిఎంల చుట్టూ జనం చక్కర్లు కొడుతూ నానా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. నగదు కోసం పడుతున్న పాట్లు వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు అనే తేడా లేకుండా గంటల తరబడి క్యూలైన్లలో నిరంతరం దర్శనమిస్తున్నాయి. ప్రజల ఇబ్బందులు అందునా.. వృద్ధులు, మహిళలు, దివ్యాంగుల సమస్యలను గుర్తించిన నగర పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్ ఒక అడుగు ముందుకేశారు. వారికి ఎదొక వెసులుబాటు కల్పించేలా చర్యలు తీసుకునేందుకు రంగంలోకి దిగారు. దీనిలో భాగంగా.. ఆయన నగరంలోని పలు బ్యాంకుల వద్దకు నేరుగా వెళ్లి గురువారం పరిశీలించారు. పటమటలోని స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్, వన్‌టౌన్‌లోని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా అదేవిధంగా రైల్వే డిఆర్‌ఎం కార్యాలయం వద్ద ఉన్న స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్ శాఖలను సందర్శించి అక్కడి శాఖాధికారులతో మాట్లాడారు. జనం పడుతున్న సమస్యల పట్ల వెసులుబాటు కల్పించాలని కోరడంతోపాటు.. వృద్ధులు, మహిళలు, దివ్యాంగుల ఇక్కట్లు సూచించారు. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరారు. అదేవిదంగా ఏటిఎంల వద్ద క్యూలైన్లలో ఉన్న వారితో సీపి మాట్లాడి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. బ్యాంకు అధికారులను ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

మహిళా చైతన్య సమితి కమిటీల ఏర్పాటు

విజయవాడ (క్రైం), డిసెంబర్ 1: నగర పోలీసుశాఖ పర్యవేక్షణలో స్వచ్చంద సంస్థలు, మహిళా సంఘాల భాగస్వామ్యంతో మహిళల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకునేందుకు ఏర్పాటు చేసిన మహిళా చైతన్య సమితి పటిష్టం కానుంది. ప్రతి వార్డు, మున్సిపల్ డివిజన్ స్థాయిలో ప్రాంతాల వారీగా కమిటీల ఏర్పాటుకు నగర పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్ నిర్ణయం తీసుకున్నారు. సమాజంలో మంచి గుర్తింపు కలిగిన మహిళలను మరికొందరితో ఏర్పాటు చేసి మహిళా సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోనున్నారు. దీనిలో భాగంగా హనుమాన్‌పేటలోని ఓ కళ్యాణ మండపంలో గురువారం సీపి సవాంగ్ ఆధ్వర్యాన నగరంలోని అన్ని పోలీస్టేషన్ల సిఐలు, ఆపైన ఉన్నత స్థాయి అధికారులు, వాసవ్య మహిళా మండలి ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీపి మాట్లాడుతూ చాలామంది మహిళలు అనేక రంగాల్లో ఎంతో అభ్యున్నతి సాధించారని, కాని కొన్ని సామాజిక, ఆర్ధిక ఇతర ప్రతిబంధకాల వల్ల పూర్తిస్థాయిలో అభ్యున్నతి సాధించలేకపోతున్నారని, అలాంటి వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించి మహిళలను స్వయం స్వావలంబన దిశగా కృషి చేద్దామని ప్రతిఙ్ఞ చేశారు. మహిళా సమస్యలను ప్రాధమిక స్థాయి నుంచి విశే్లషించి వాటికి సంబంధించిన మూలాలను గుర్తించి, తగిన పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని ఉద్భోధించారు. మహిళా సమస్యలను ప్రతి వార్డు, మున్సిపల్ డివిజన్ స్థాయిలో పరిష్కరించేందుకు పది మంది లోపు సభ్యులతో ఒక కమిటి, పోలీస్టేషన్ స్థాయిలో పది మందిలోపు సభ్యులతో కార్యనిర్వహక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ దిశగా చర్యలు తీసుకుని మహిళా సమస్యలను పరిష్కరించేందుకు అందరూ ముందుకు రావాలని సీపి పిలుపునిచ్చారు. సమావేశంలో సీపితోపాటు జాయింట్ సీపి పి హరికుమార్, మహిళా స్టేషన్ ఏసిపి వివి నాయుడు, వాసవ్య మహిళా మండలి నుంచి మాజీ ఎంపి చెన్నుపాటి విద్య, కీర్తి తదిరులు పాల్గొన్నారు.