విజయవాడ

బెనిఫిషరీ కాంట్రీబ్యూషన్‌ను ప్రభుత్వమే రీఎంబర్స్ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 2: కృష్ణా పుష్కరాల సమయంలో చేపట్టిన రోడ్ల విస్తరణకు అడ్డంగా ఉన్న ఇళ్లు తొలగించిన వారికి జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం జి ప్లస్ త్రీ పక్కాగృహాల కేటాయించిన లబ్ధిదారుల కాంట్రిబ్యూషన్ రాష్ట్ర ప్రభుత్వమే రీఎంబర్స్‌మెంట్ చేయాలని నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ కరికల్ వలవన్‌ను కోరారు. శుక్రవారం అమరావతిలోని సచివాలయంలో ఆయనను కలిసిన మేయర్ శ్రీ్ధర్ నగర పాలక సంస్థకు చెందిన పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో భాగంగా నిబంధనల ప్రకారం లబ్ధిదారుడు చెల్లించాల్సిన కంట్రిబ్యూషన్ చెల్లించిన తరువాతే పక్కాగృహాల కేటాయింపు జరగాల్సి ఉండగా, ప్రభుత్వ సూచనల మేరకు వారి వద్ద నుంచి ఎటువంటి చెల్లింపులు లేకుండానే పక్కాగృహాలను కేటాయించినందున అందుకు సంబంధించిన కంట్రిబ్యూషన్‌ను ప్రభుత్వమే నగర పాలక సంస్థకు జమచేయాలని కోరారు. అలాగే 2017 మార్చి 31తో ముగుస్తున్న జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకంలో నిర్మించాల్సిన పక్కాగృహాల నిర్మాణ సౌలభ్యం కోసం 50లక్షల లోపు ప్యాకేజీ ఎస్టిమేట్లను రూపొందించి ఇళ్ల నిర్మాణ పూర్తికి అనుమతించాలన్నారు. విఎంసి పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన టేబుల్స్, కుర్చీలు, డెస్కుల ఏర్పాటుకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని కోరిన మీదట ప్రిన్సిపల్ సెక్రటరీ కరికల్ వలవన్ సానుకూలంగా స్పందించి తగు చర్యలు తీసుకొంటాని హామీ ఇచ్చినట్టు నగర మేయర్ శ్రీ్ధర్ పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో కోఅప్షన్ సభ్యుడు సిద్దెం నాగేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.