విజయవాడ

రెండో రౌండ్‌కు తెలుగు రాష్ట్రాల జట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), డిసెంబర్ 2: కృష్ణాజిల్లా బాడ్మింటన్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ బాడ్మింటన్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని మూడు స్టేడియాల్లో జరుగుతున్న డిపిఎస్ వరల్డ్ స్కూల్ 30వ జాతీయస్థాయి సబ్ జూనియర్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు రెండో రౌండ్‌కు అర్హత సాధించారు. అండర్-13 బాలుర విభాగంలో పోటీపడుతున్న జాతీయ బాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ కుమారుడు పి సాయికృష్ణ రెండోరౌండ్‌లో విజయం సాధించి మూడోరౌండ్‌కు చేరుకున్నాడు. బాలుర అండర్-13 సింగిల్స్ విభాగంలో కవిష్ పరిఖ్ (గుజరాత్)పై 22-20, 16-21, 21-15 తేడాతో మోహిత్‌రెడ్డి (ఆంధ్రప్రదేశ్), జయేష్ (చత్తీస్‌ఘడ్)పై 21-10,21-15తేడాతో సాహస్‌కుమార్ (తెలంగాణ), జీత్‌పాటిల్ (గుజరాజ్)పై 21-11,21-19 తేడాతో ఎన్ అనిరుధ్ (తెలంగాణ), షీబంపాల్ (త్రిపుర)పై 21-8,21-10 తేడాతో ఎ నిధిష్‌భట్ (ఆంధ్రప్రదేశ్), అష్మిత్ శ్రీవాత్సవ (చత్తీస్‌ఘడ్)పై 21-15,21-14 తేడాతో బివి ఉనీత్‌కృష్ణ (తెలంగాణ)లు మొదటి రౌండ్‌లో విజయం సాధించి రెండోరౌండ్‌కు చేరుకున్నారు. బాలికల విభాగంలో పాల్‌మీనా (రాజస్థాన్)పై 21-8,21-6 తేడాతో కె అశ్రీత (తెలంగాణ), పవిత్రనవీన్ (కేరళ)పై 21-16,17-21,23-21తేడాతో ఎన్ చిరుహశిని(ఆంధ్రప్రదేశ్)లు గెలుపొంది రెండోరౌండ్‌కు చేరారు.శ్రీదుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల ఇండోర్ స్టేడియం, విజయవాడ క్లబ్, డిఆర్‌ఆర్‌ఎంసి ఇండోర్ స్టేడియంలలో మ్యాచ్‌లు జరుగుతున్నాయి.