విజయవాడ

చౌకడిపోల్లో నగదురహిత లావాదేవీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 2: నగదు రహిత లావాదేవీలను చౌకధరల దుకాణాల్లో సక్రమంగా నిర్వహించి ప్రజలను ప్రోత్సహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు అన్నారు. శుక్రవారం జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు లబ్బిపేటలోని బాడవపేట, 237 చౌకధర దుకాణం, పటమట రైతుబజారులలో నగదు రహిత చెల్లింపులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 11 లక్షల 88 వేల రేషన్‌కార్డులు ఉన్నాయని, వీటిలో 10.66 లక్షలు రేషన్ కార్డులు, ఆధార్, బ్యాంకు ఖాతాలను యన్‌పిసిఐతో అనుసంధానించబడి ఉన్నాయన్నారు. దీనివలన జిల్లాలో చౌకధరల దుకాణాలలో నగదు చెల్లింపులు సులభతరమవుతాయని జాయింట్ కలెక్టర్ అన్నారు. దేశ వ్యాప్తంగా నగదు రహిత చెల్లింపులు విస్తృతంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోరిందన్నారు.
మన జిల్లాలో ఎప్పటినుండో రేషన్ సరుకు, పింఛన్లు, ఎరువులు నగదు రహితంగా నిర్వహిస్తున్నామని జాయింట్ కలెక్టర్ గుర్తు చేశారు. దేశంలోనే మనజిల్లాలో అమలు జరుగుతున్న నగదు రహిత లావాదేవీలను పరిశీలించి ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారన్నారు. చౌకధరల దుకాణాలలో బ్యాంకు ఖాతా లేనివారికి తక్షణమే బ్యాంకింగ్ కరస్పాండెంట్లు ద్వారా ఖాతాలను తెరచేలా డీలర్లు చర్యలు చేపట్టాలన్నారు. రేషన్ కార్డులను, ఆధార్, బ్యాంక్ ఖాతాలతో ఎన్‌పిసిఐతో అనుసంధానించేలా పౌర సరఫరాలు, రెవెన్యూ, డీలర్లు కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. క్షేత్రస్థాయి పర్యటనలో జాయింట్ కలెక్టర్‌తో పాటు డిఎస్‌ఒ వి.రవికిరణ్ ఉన్నారు.