విజయవాడ

వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో ప్రపంచబ్యాంక్ ప్రశంసలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 2: వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని జిల్లాలో ప్రణాళికాబద్దంగా చేపట్టి ప్రపంచబ్యాంకుచే ప్రశంసలు అందుకున్నామని జిల్లా కలెక్టర్ బాబు.ఎ ర్యాపిడ్ ఎసెస్‌మెంట్ టీమ్ సభ్యులకు వివరించారు. జిల్లాలో చేపడుతున్న వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ప్రపంచబ్యాంక్ నుండి ర్యాపిడ్ ఎసెస్‌మెంట్ టీమ్ సభ్యులు వసుంధరావు, అరవింద్‌లు శుక్రవారం జిల్లా కలెక్టర్ బాబు.ఎను క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంపూర్ణ పారిశుద్ధ్యంలో భాగంగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని జిల్లా యంత్రాంగం పెద్దఎత్తున చేపట్టి దేశానికే ఆదర్శంగా నిలిచామన్నారు. గ్రామాలలో ప్రత్యేక అధికారులను నియమించి ప్రజలకు అవగాహన కల్పించటంతో పాటు త్వరితగతిన పూర్తి చేసేలా ప్రణాళికాబద్ధంగా చేపట్టామన్నారు. స్ర్తినిధి నుండి స్వయం సహాయక సంఘాలకు 10వేల మంది లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే సహాయాన్ని వారి ఖాతాలకు నేరుగా జమయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు. మలవిసర్జన రహితంగా ప్రకటించిన గ్రామ పంచాయతీకి రూ.5లక్షల నిధులను నేరుగా ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందన్నారు. క్షేత్రస్థాయిలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలించి ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరిస్తున్నారన్నారు. ఈ మాసాంతంలోపు 501 గ్రామాలు ఒడిఎఫ్‌గా ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నాయని, వీటిలో ఇప్పటికే 189 గ్రామాలను ఒడిఎఫ్‌గా పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ బాబు.ఎ ప్రపంచబ్యాంకు ప్రతినిధులకు వివరించారు. సమావేశంలో ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ టి.శ్రీనివాసరావు, జిల్లా అభివృద్ధి అధికారి డి.శ్యాంసుందరరావు పాల్గొన్నారు.