విజయవాడ

రైతుబజార్లలో నగదు రహిత లావాదేవీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 2: జిల్లాలోని అన్ని రైతు బజార్లలో పాస్ మిషన్లు (పాయింట్ ఆఫ్ సేల్)ద్వారా నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గంథం చంద్రుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం జాయింట్ కలెక్టర్ గంథం చంద్రుడు నగరంలోని ఆయన క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో మార్కెటింగ్, రైతు బజారుల ఎస్టేట్ ఆఫీసర్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రైతు బజార్లలో 2,500 పాస్ మిషన్లు ఏర్పాటు చేయాలని ఇందుకు బ్యాంకు అధికారుల సహకారం తీసుకోవాలన్నారు. బ్యాంకు ఖాతాలు లేనివారికి తక్షణమే బ్యాంకింగ్ కరస్పాండెంట్లు ద్వారా ఖాతాలను తెరిపించాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. పెద్దనోట్ల రద్దువలన కలిగే అసౌకర్యానికి నగదు రహిత లావాదేవీలు పరిష్కారమని జాయింట్ కలెక్టర్ అన్నారు. వినియోగదారులు తమ యొక్క డెబిట్, క్రెడిట్, రూపే కార్డుల ద్వారా చెల్లింపులు నిర్వహించవచ్చని, దుకాణదారులు వినియోగదారులకు నగదు రహిత చెల్లింపులపై అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్ కోరారు.
సమావేశంలో మార్కెటింగ్ శాఖ ఎడి జె.రవికుమార్ జిల్లా డిడిఒ శ్యాంసుందర్, రైతుబజార్‌ల ఎస్టేట్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
పటమట రైతు బజారును ఆకస్మికంగా తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ గంథం చంద్రుడు
పటమట రైతుబజారులో జరుగుతున్న కార్యకలాపాలను జాయింట్ కలెక్టర్ గంథం చంద్రుడు ఆకస్మిక తనిఖీ చేసి రైతు బజారు ఎస్టేట్ అధికారులకు పలు సూచనలు చేశారు. రైతు బజార్లలో బినామీలను అనుమతించేది లేదని, అసలైన రైతులు మాత్రమే ఉత్పత్తులను అమ్ముకునే విధంగా చర్యలు చేపట్టాలని ఎస్టేట్ అధికారులను ఆదేశించారు. ప్రతి స్టాల్‌ను వ్యక్తిగతంగా పరిశీలించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మాత్రమే కూరగాయలను అమ్మాలని, దళారీ వ్యవస్థ అనుమతిస్తే చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు.