విజయవాడ

సిఆర్‌డిఎ రీజియన్‌లో నిబంధనల మేరకే అనుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 2: ఎపి సిఆర్‌డిఎ రీజియన్ పరిధిలో అనుమతులన్నీ నిబంధనల మేరకే మంజూరవుతాయని కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ పేర్కొన్నారు. ఈమేరకు శుక్రవారం నగరంలోని సిఆర్‌డిఎ కార్యాలయంలో నిర్వహించిన ఓపెన్ ఫోరంలో ఆయన దరఖాస్తుదారులు, అధికారుల సమక్షంలో పలు దరఖాస్తులను పరిశీలించి పలు సూచనలు చేశారు. తొలుత ఆయన మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలతో దరఖాస్తుదారులు సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా పాలనలో దళారుల ప్రమేయం నియంత్రించేందుకు గాను నేరుగా దరఖాస్తుదారుల సమక్షంలోనే వారి దరఖాస్తులను పరిశీలించి వాటిపై తగు నిర్ణయం చెప్పడం వలన అధికారులకు, దరఖాస్తుదారులకు మధ్య సత్సంబందాలు నెలకొనడమే కాకుండా పారదర్శకమైన పాలనను అందించవచ్చన్నారు. ఈసందర్భంగా జరిగిన ఓపెన్ ఫోరంలో ఒక సాధారణ లే అవుట్‌కు గేట్‌ను ఏర్పాటు చేసి గేటెడ్ కమ్యూనిటీ మాదిరిగా లే అవుట్‌ను చిత్రీకరించిన విధానంపై ఆక్షేపక్షణ తెలిపిన శ్రీ్ధర్ నిబంధనల మేరకే లే అవుట్లను రూపొందించాలని, వినియోగదారులను మభ్యపెట్టే ఎటువంటి అనైతిక చర్యలనైనా అనుమతించేది లేదని స్పష్టం చేశారు. లే అవుట్ రోడ్లను ఇతర రోడ్లకు కలిసే విధంగా యాక్సెస్ తప్పనిసరిగా ఉండాలన్నారు. అక్యుపెన్సీ సర్ట్ఫికెట్ కోసం దరఖాస్తు చేసుకొన్న భవన నిర్మాణదారుడు చేసుకొన్న దరఖాస్తును పరిశీలించిన ఆయన ఆ భవనానికి సంబంధించి సెట్‌బ్యాక్ కొతలపై నిశితంగా పరిశీలించిన ఆయన ఆ నిర్మాణ తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సంబంధిత ఇంజనీరింగ్ సూపర్‌వైజర్‌పై మండిపడటం గమనార్హం. ఈసందర్భంగా పలు దరఖాస్తులను పరిశీలించిన శ్రీ్ధర్ అన్ని పత్రాలు సక్రమంగా ఉన్న దరఖాస్తులకు ప్రాథమిక అనుమతులను మంజూరు చేసారు. అలాగే నిబంధనల విషయంలో అస్పష్టత ఉన్న దరఖాస్తులను మరోసారి పరిశీలించిన అనంతరం ఆయా అనుమతులను మంజూరు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎలాంటి తేడాలు లేకుండా పత్రాలన్నింటినీ జతచేసి లైసెన్స్‌డ్ సర్వేయర్ ద్వారా దరఖాస్తులను సమర్పిస్తే ఆయా అనుమతులు సులువుగా మంజూరవుతాయన్న విషయాన్ని గుర్తించాలని హితవుపలికారు. అనుమతుల మంజూరులో ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా పారదర్శకంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఓపెన్ ఫోరంలో సుమారు 24 దరఖాస్తులు రాగా వాటిలో 14 దరఖాస్తులకు అప్పటికప్పుడు అనుమతులను మంజూరు చేయగా 9 దరఖాస్తులకు అదనపు సమాచారాన్ని కోరారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఒక దరఖాస్తును ఆయన తిరస్కరించారు. భవన నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకొన్న 8దరఖాస్తులలో ఏడింటికి అప్పటికప్పుడు ప్రాథమిక అనుమతులను మంజూరు చేశారు. రాజధాని నగరం పరిధిలోని గ్రామ కంఠం స్థలాలకు సంబంధించి 4 దరఖాస్తులుండగా ఎర్రబాలెంలో ఒకటి, మందడంలో 3 జి ప్లస్ వన్ భవనాలకు అనుమతించారు. ఆక్యుపెన్సీ సర్ట్ఫికేట్ కోసం వచ్చిన 9 దరఖాస్తులలో ఐదింటికి అనుమతులు మంజూరు చేయగా మరో 4 దరఖాస్తులకు అదనపు సమచారం కోరారు. లే అవుట్ అనుతుల కోసం 5 దరఖాస్తులు రాగా అన్నిపత్రాలు సక్రమంగా ఉన్న 2 లేఅవుట్లకు అనుమతులు మంజూరు చేసారు. అలాగే పరిశ్రమలకు సంబంధించి 2 దరఖాస్తులలో ఒక దానికి అదనపు సమాచారాన్ని కోరగా మరో దానిని తిసర్కరించారు. ఈకార్యక్రమంలో ప్లానింగ్ అధికారి సిహెచ్‌వి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.