విజయవాడ

అధికారం ఎవరి సొత్తు కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 5: కాంగ్రెస్ పార్టీకి అధికారం కొత్త కాదని ప్రజల సమస్యలే ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ఏపిసిసి అధ్యక్షుడు డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి తెలిపారు. ఎపిసిసి కార్యాలయంలో ఎపి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ ఆధ్వర్యంలో సోమవారం ఆంధ్రప్రదేశ్ మహిళా కాంగ్రెస్ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏపిసిసి చీఫ్ రఘువీరారెడ్డి, ఎపిసిసి ప్రధాన కార్యదర్శులు గిడుగు రుద్రరాజు, టిజేఆర్ సుధాకర్ బాబు, ఎస్‌ఎన్ రాజాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నాయని ఇబ్బందులు అధిగమించేందుకు కసితో పనిచేయాలని పిలుపునిచ్చారు. కొత్త నాయకత్వానికి మంచి అవకాశాలు ఉన్నాయని అందిపుచ్చుకునేందుకు మహిళలు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎపిలో అధికార పార్టీకి చెందిన సర్వే ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్ 2 శాతం నుంచి 6 శాతానికి బలం పుంజుకుందని ఆయన అన్నారు. వాస్తవంగా 10 శాతంపైగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుందన్నారు. మహిళా కాంగ్రెస్ బలోపేతానికి ఎపిసిసి ఉపాధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో త్వరలో మహిళా కాంగ్రెస్ కమిటీలకు చెందిన 200 మంది ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. కాంగ్రెస్ హయాంలో బంగారుతల్లి, వైఎస్ అభయహస్తం మొదలైన సంక్షేమ పథకాలు అమలుచేసినట్లు గుర్తు చేశారు. ఈ సమావేశానికి ఎపిలోని 13 జిల్లాల నుంచి విశాఖ, ప్రకాశం, కడప, తిరుపతి, గుంటూరు, నెల్లూరు జిల్లాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో బంగారంపై కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలను తక్షణం ఎత్తివేయాలని తీర్మానించింది. పిసిసి నిర్వహిచిన ప్రజా బ్యాలెట్‌లోను, ఇందిరమ్మ శత జయంతి ఉత్సవాల్లో మహిళలు భాగస్వాములు కావాలని పద్మశ్రీ పిలుపునిచ్చారు.