విజయవాడ

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కరవు నివారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 17: భవిష్యత్‌లో కరవును అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. నగరంలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో మంగళవారం మంత్రి మీడియా ప్రతినిధుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కరవు నివారణ, జల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రధానమంత్రికి వివరించారన్నారు. కరవు నుండి రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుతున్నది, భవిష్యత్‌లో కరవు పరిస్థితులు తలెత్తకుండా ప్రభుత్వం తీసుకుంటున్న ముందస్తు చర్యలను ప్రధాన మంత్రికి వివరించామన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని కరువు నివారణకు చేపడుతున్న ముందస్తు చర్యలతో రాష్ట్ర ముఖ్యమంత్రి రోల్‌మెడల్‌గా నిలుస్తారన్నారు. ప్రతి పక్ష నాయకుడు కర్నూలులో మూడు రోజుల దీక్ష జగన్నాటకమే అని, కేంద్రంతో ఏనాడు రాష్ట్ర ప్రయోజనాలపై మాట్లాడిన సందర్భంలేదన్నారు. విభజన చట్టంపై ప్రధాన మంత్రిని ఏ సందర్భంలోను కలవలేదని పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులను అడ్డుకోవడం, క్యాడర్‌ను ఏ విధంగా రక్షించుకోవాలనే ఆలోచన తప్ప రాష్ట్ర ప్రయోజనాలపై ఏ మాత్రం ఆకాంక్ష లేదని మంత్రి తెలిపారు. ప్రతి పక్ష నాయకుడు నుండి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం తమ పార్టీకిగాని, ప్రభుత్వానికి గాని లేదన్నారు. 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగాను, 9 సంవత్సరాలు అధికారంలోను, తర్వాత రెండు సంవత్సరాలు అధికారం పూర్తి చేసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవం అంత లేదు ప్రతిపక్ష నాయకుని వయస్సు అని మంత్రి అన్నారు. జలదీక్ష జగన్నాటకం, తప్ప పార్టీ ఉనికిని కాపాడుకోవడం, రక్షించుకోవడం ఆలోచన మాత్రమే అని మంత్రి విమర్శించారు. స్పెషల్ స్టేటస్‌పై అన్ని పార్టీలు, అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించాయని, కలెక్టరేట్‌ల వద్ద ధర్నా ఎందుకుని విమర్శించారు.