విజయవాడ

నడిరోడ్డుపై ట్రాఫిక్ డ్యూటీ చేసిన ‘డ్రంకన్ డ్రైవర్స్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), డిసెంబర్ 9: నడిరోడ్డుపై ‘డ్రంకన్ డ్రైవర్స్’ ట్రాఫిక్ విధులు నిర్వహించారు. ఇందులో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. తాగి రోడ్డుపై విచ్చలవిడిగా వాహనం నడపగా లేనిది.. ట్రాఫిక్ విధులు నిర్వహించడం పెద్ద కష్టమేమీ కాదంటూ జనం నిట్టూర్పు విడిచారు. అసలు విషయానికొస్తే.. తాగి వాహనం నడిపి పోలీసులకు పట్టుబడగా.. కోర్టు వీరికి విధించిన శిక్ష ఇది. కోర్టు ఆదేశాలతో పట్టుబడిన ఎనిమిది మందిలో ఏడుగురు వ్యక్తులు రమేష్ ఆస్పత్రి జంక్షన్ వద్ద, మరొక వ్యక్తి బెంజిసర్కిల్ వద్ద డ్యూటీ చేశారు. వీరిలో ప్రైవేటు ఉద్యోగులు, ఆటోడ్రైవర్లు, ఇద్దరు బిటెక్ విద్యార్థులు ఉన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమానాతో సరిపెట్టేది లేదని, కఠినంగా శిక్షలుంటాయని ఓ వైపు ప్రభుత్వం, కోర్టులు హెచ్చరికలు చేస్తున్నా.. అవేమీ బుర్రకెక్కని ‘తాగు బోతులు’ మాత్రం కిక్కు తలకెక్కగానే.. నడి రోడ్లపై కిక్కిరిసిన జనం మధ్య నుంచి రయ్‌మంటూ మోటారు సైకిళ్ళపై దూసుకెళ్తున్నారు. ఇలాంటప్పుడు అనేక సందర్భాల్లో రోడ్డు ప్రమాదాలకు గురై వారు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా.. పక్కన వెళ్ళే వారిని కూడా బలి తీసుకుంటున్నారు. ఈ తరహా మత్తు డ్రైవింగ్ చేసే వారిలో యువకులు, విద్యార్థులు ఉండటం గమనార్హం. తప్పతాగి తమ నిర్లక్ష్య డ్రైవింగ్‌తో రోడ్డుపై వెళ్ళేవారిని పొట్టన పెట్టుకుంటున్న ఇలాంటివారికి కళ్ళెం వేసేందుకు నగర ట్రాఫిక్ పోలీసులు నిరంతరం ‘స్పెషల్ డ్రైవ్’ నిర్వహిస్తూనే ఉన్నారు. పోలీసుల అర్ధరాత్రి ప్రత్యేక తనిఖీల్లో ప్రతిరోజూ తాగి వాహనాలు నడిపేవారు పెద్ద సంఖ్యలోనే పట్టుబడుతున్నారు. ఇలాంటి వారిపై కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేసి మరుసటి రోజు కోర్టులో హాజరుపరుస్తున్నారు. కేవలం జరిమానాతో వదలకుండా వీరికి జైలుశిక్ష విధించాలంటూ పోలీసులు న్యాయస్థానాలకు విఙ్ఞప్తి చేస్తున్నారు కూడా. దీంతో ఇటీవల కాలంలో పట్టుబడిన డ్రంకన్ డ్రైవర్స్‌కు ఒకటి, రెండు నుంచి వారం రోజుల పాటు జైలుశిక్షలు విధించిన దాఖలాలు ఉన్నాయి. పైగా.. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండే కొంతమంది వ్యక్తులు కూడా నిబంధనలు తోసిరాజంటూ తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. కొంతకాలం క్రితం ఓ వైద్యుడు ఇదే మాదిరిగా పోలీసులకు దొరకగా.. కోర్టు జరిమానాతోపాటు, సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించింది. ఇలాగైనా పరివర్తన కలుగుతుందని భావించిన న్యాయస్ధానాల ఉద్ధేశ్యం నానాటికీ నీరుగారిపోతోంది. నగరంలో తాజా ఉదంతమే ఇందుకు నిదర్శనం. తాగి డ్రైవింగ్ చేసిన ఎనిమిది మంది శనివారం అర్ధరాత్రి ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారు. వాహనాలు సీజ్ చేసి వీరిని కోర్టులో హాజరుపరిచారు. ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు జరిమానా విధించడంతోపాటు రెండురోజుల పాటు ట్రాఫిక్ అధికారులు, సిబ్బందికి విధుల్లో సహకరించాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో శుక్రవారం నగరంలోని బెంజిసర్కిల్ వద్ద జి త్రినాధ్ అనే వ్యక్తి, రమేష్ ఆస్పత్రి జంక్షన్ వద్ద బి ప్రసాద్, ఎస్ రాజేంద్రప్రసాద్ అనే ప్రైవేటు ఉద్యోగులు, ఎస్‌కె భాషా, పి బాబ్జి, కె భాగ్యరాముడు అనే ఆటోడ్రైవర్లు, డి తరుణ్‌రెడ్డి, ఎ మణికుమార్ అనే బిటెక్ విద్యార్థులు ఉదయం 8 గంటల నుంచి 12 వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు షిఫ్టు పద్దతిలో విధుల్లో పాల్గొన్నారు. శనివారం కూడా విధులకు హాజరైన మీదట ట్రాఫిక్ అధికారుల నివేదిక మేరకు సీజైన వీరి వాహనాలకు విముక్తి, వీరికి వెసులుబాటు కలుగుతుంది. ఇలాగైనా.. డ్రంకన్ డ్రైవర్స్‌లో పరివర్తన కలుగుతుందేమో వేచి చూద్దాం.