విజయవాడ

ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి సిఎం పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, డిసెంబర్ 10: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని సాంఘిక, గిరిజన సంక్షేమం, సాధికారత శాఖల మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. శనివారం 4వ డివిజన్ మాచవరం యారం వారి వీధిలో 1.25 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఎస్సీ కల్యాణ మండపానికి ఆయన శంకుస్థానన చేశారు. అనంతరం పసుపు, కుంకమ కింద 153 డ్వాక్రా సంఘాలకు 46 లక్షల రూపాయల బ్యాంకు పత్రాలను ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌తో కలిసి మంత్రి అందచేశారు. ఈసందర్భంగా రావెల మాట్లాడుతూ తాను దివంగత మాజీ స్పీకర్ బాలయోగి దగ్గర పిఏగా పనిచేస్తున్నప్పుడు రామమోహన్ పార్లమెంట్ సభ్యులుగా వున్నారని, ఆయన ఎంపి కార్యాలయం ద్వారా ప్రజలకు అందించిన సేవలను పరిశీలించడానికి బాలయోగి తనను ప్రత్యేకంగా రామమోహన్ దగ్గరకు పంపారని గుర్తు చేశారు. గత పాలకులు ఎస్సీ, ఎస్టీల నిధులు దుర్వినియోగం చేశారని ఆయన ఆరోపించారు. రాష్ట్రం 16 వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్‌లో వున్నప్పటికీ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు 12 వేల కోట్లు కేటాయించిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. ఎస్సీ కల్యాణ మండపానికి ఇంకా అవసరమైతే మరో రూ.75 లక్షలు ఇచ్చేందుకు సిద్ధంగా వున్నానని మంత్రి రావె ల ప్రకటించారు. శాసనసభ్యులు గద్దె రామమోహన్ మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల నుంచి వివిధ అభివృద్ధి పనులకు రూ.12 కోట్లు కేటాయించారని, ఇంకా అవసరమైతే నిధులు ఇస్తామన్న మంత్రి రావెలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నగర మేయర్ కోనేరు శ్రీ్ధ ర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల నుంచి నగరాభివృద్ధికి రూ.19 కోట్లు నిధులు కేటాయించారని, పూర్తిస్థాయిలో వాటిని సద్వినియోగం చేశామని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ దాసరి మల్లేశ్వరి, యలమంచిలి గౌరంగబాబు, కార్పొరేటర్ సాహెరా బాను, చెరుకూరి నాని, ముమ్మనేని ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

మాస్టర్ అథ్లెట్స్
యువతకు స్ఫూర్తిదాయకులు
విజయవాడ (స్పోర్ట్స్), డిసెంబర్ 10: మాస్టర్ అథ్లెట్స్ స్ఫూర్తి దాయకులని, పిల్లలందరికీ వారు ఆదర్శంగా నిలిచారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో 36వ రాష్టస్థ్రాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ప్రారంభమైంది. ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని పోటీలను ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ 30 సంవత్సరాలు దాటిన తరువాత క్రీడల్లో పాల్గొని యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని, 2018లో జాతీయ స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌ను విజయవాడలో నిర్వహించడానికి కృషిచేయాలని, ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామన్నారు. అంతకుముందు వివిధ జిల్లాల జట్లు చేసిన మార్చ్‌పాస్ట్ అందరినీ అలరించగా అతిథులు గౌరవ వందనం స్వీకరించారు. విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు, శ్రీరాం తాతయ్య, మాస్టర్స్ అథ్లెటిక్స్ సంఘ చైర్మన్ ఎవిఆర్ చౌదరి, అధ్యక్షులు ఎం రవి, వినోర్‌కుమార్, భగవాన్, డా. టివి రావు, టి సుబ్బారావు, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.