విజయవాడ

సెలెక్ట్ లాడ్జిపై చర్యలు తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మే 17: గాంధీనగర్‌లోని సెలెక్ట్ లాడ్జి నిర్వాహుకులపై విఎంసి చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ ఆదేశించారు. ఈ సందర్భంగా మేయర్ శ్రీ్ధర్ సెలెక్ట్ లాడ్జి పక్కనున్న విఎంసి షాపింగ్ కాంప్లెక్సును పరిశీలించిన నేపథ్యంలో విఎంసి స్థలాన్ని ఆక్రమించుకుని వినియోగించుకొంటున్న ఆక్రమిత స్థలాన్ని తక్షణమే స్వాధీనం చేసుకోవాలన్నారు. డ్రైనేజీ కనెక్షన్ తీసుకోకుండా పక్కనున్న నది కాల్వలోకి పారుదల చేస్తున్న సెలెక్ట్ లాడ్జిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. కాలువ వడ్డునున్న కౌత పూర్ణానంద ధర్మ సత్రానికి ఆస్తి పన్ను విధించాలన్నారు. ఈ పర్యటనలో స్థానిక కార్పొరేటర్ ముప్పా వెంకటేశ్వరరావు, ఇఇ పివికె భాస్కరరావు, డిఇఇ కె నారాయణమూర్తి పాల్గొన్నారు.