విజయవాడ

బిజెపికి వెలంపల్లి గుడ్‌బై!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతబస్తీ, డిసెంబర్ 10: మాజీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ బిజెపికి రాజీనామా చేసి ఈ నెల 13, లేదా వచ్చే జనవరి 26న అధికారికంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని విశ్వసనీయంగా తెలిసింది. 2009లో సినీహీరో చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం తరఫున ఆయన పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేసి విజయం సాధించారు. తరువాత చిరంజీవి పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయటంతో వెలంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగారు. 2014లో ఆఖరి నిమిషంలో బిజెపిలో చేరారు. తెలుగుదేశం పార్టీ నుంచి తగిన మద్దతు లభించక పోవటంతో ఆయన ఓటమిపాలయ్యారు. అంతకుముందు టిడిపిలోకి రావడానికి యత్నించినా అసెంబ్లీ సీటు గ్యారంటీ లేక బిజెపిలో చేరారు. కానీ తెలుగుతమ్ముళ్లు కొందరు పార్టీని దృష్టిలో పెట్టుకుని ఓట్లు వేశారు. వెలంపల్లి సామాజిక వర్గంలో కొందరు ఆయన తరపున నిలబడ్డారు. వెరశి సుమారు 60వేల ఓట్లు సాధించినా ఓటమిపాలయ్యారు. ఇప్పటివరకు బిజెపి నాయకునిగా కొనసాగిన వెలంపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులకు పలు అంశాల్లో దీటైన సమాధానమిచ్చారు. ఇంతచేసినా బిజెపిలో ఆయనకు తగిన ప్రాధాన్యత లభించలేదు. ఇటీవల తాడేపల్లిగూడెంలో రైతుసభకు వచ్చిన బిజెపి అధ్యక్షుడు అమిత్ షాకి గజమాల వేశారు. నగరం నుండి ఛోటామోటా నాయకులను తరలించారు. లక్షలాది రూపాయలు ఖర్చుచేసినా అమిత్ షా నుండి రాజకీయపరమైన ఎలాంటి భరోసా లభించలేదు. దాంతో వెలంపల్లి పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. తెలుగుదేశం గూటిలో చేరదామంటే అన్ని ద్వారాలు మూసుకుపోయాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు దెయ్యంలా చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో అసెంబ్లీ సీటు ఇవ్వడానికి వైకాపా నాయకులు అంగీకరించడంతో ఆయన అడుగులు అటుపడుతున్నట్లు భోగట్టా. వైకాపా టిక్కెట్‌పై గెలిచిన జలీల్ ఖాన్ టిడిపిలోకి జంప్ కావడంతో ఇక్కడ ఆ పార్టీకి సరైన నాయకుడు కరవయ్యాడు. దీంతో వెలంపల్లికి వెతుక్కుంటూ అవకాశం వచ్చిందని అంటున్నారు.

80 శాతానికి పైగా ఎటిఎంల మూత
* చేతిలో డబ్బులేక జనం విలవిల

విజయవాడ, డిసెంబర్ 10: ఒకరోజు, రెండు రోజుల కాదు, ఏకంగా మూడు రోజులు జాతీయ బ్యాంక్‌లకు సెలవుదినాలు కావటంతో ఖాతాదారులు డబ్బు డ్రాచేసుకునే అవకాశం లేనేలేదు. కనీసం రోజులో రెండు వేల రూపాయలైనా ఎటిఎం కేంద్రాల్లో డ్రాచేసుకుందామనుకుంటే రాజధాని విజయవాడ నగరంలో దాదాపు 80 శాతానికి పైగా మూతబడ్డాయి. నిన్నటివరకు షట్టర్లు సగం మూసి ఉంచారు. అయితే ప్రజల్లో చోటుచేసుకుంటున్న ఆగ్రహావేశాలను చూసి సెక్యూరిటీ గార్డులు భయపడి పూర్తిగా షట్టర్లను మూసేసి అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. దీంతో అసలు ఎటిఎంలు ఎప్పుడు తెరుస్తారో తెలియని స్థితి నెలకొంది. ఇక అక్కడక్కడా కొన్ని కేంద్రాలు పనిచేస్తుంటే ఎప్పుడు చూసినా కనీసం వంద మందికి పైగా బారులుదీరి నిలబడటం కనిపిస్తోంది. కొంతసేపటికే ఆ కేంద్రాలు కూడా మూతబడుతున్నాయి. రెండు వేల రూపాయలు డ్రా చేసుకోవటం కోసం ఎటిఏం కేంద్రాల చుట్టూ తిరగడానికి గంటల తరబడి సమయం పట్టటం అటుంచి పెట్రోలు ఖర్చులు పెరుగుతుంటే చేతిలో చిల్లిగవ్వలేక ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. మొదటివారంలో ఇంటి అద్దెలు, చిల్లర సరుకుల కొనుగోలు, పనిమనుషులకు నెలవారీ జీతాలు, కరెంట్ బిల్లులు, పేపర్ బిల్లులు, నెట్ బిల్లులు, ఫోన్ బిల్లులు ఇలా అనేకం చెల్లించాల్సి రావడంతో బ్యాంకుల్లో డబ్బులుండి కూడా దిక్కుతోచక ప్రజలు సతమతవౌతున్నారు.