విజయవాడ

బెజవాడ అడ్డాగా గంజాయి రవాణా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), డిసెంబర్ 10: విజయవాడ కేంద్రంగా గంజాయి పెద్దఎత్తున అక్రమ రవాణా జరుగుతోంది. విశాఖ జిల్లా నుంచి తరలుతున్న సరుకు పెద్ద ఎత్తున విజయవాడ మీదుగా ఇతర రాష్ట్రాలకు చేరుతోంది. నగరాన్ని అడ్డాగా మార్చుకున్న ‘గంజాయి మాఫియా’ కోట్ల రూపాయల అక్రమార్జనకు పాల్పడుతున్నారు. ఇప్పటికే పలుమార్లు టన్నుల కొద్ది గంజాయి నగరంలో పట్టుబడగా.. తాజాగా టాస్క్ఫోర్స్ పోలీసులు దాడిలో శనివారం దాదాపు 300 కిలోలకు పైగా గంజాయి దొరికిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. పోలీసు రికార్డుల్లో ‘మోస్ట్ వాంటెడ్’గా నమోదైన పేరుమోసిన ఓ వ్యక్తిని కొద్దిరోజుల క్రితం ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకుని టన్ను గంజాయి లారీని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో మరో లారీ గంజాయి లోడు పటమటలో పార్కింగ్ చేసి ఉండటాన్ని గుర్తించారు. ఇప్పుడు తాజాగా సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ ఏసిపి ప్రసాద్ నేతృత్వంలో ఎస్‌ఐ శ్రీనివాస్, సిబ్బంది నగరంలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా సుమారు 325 కేజీల గంజాయితో రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఏలూరుకు చెందిన సదరు వ్యక్తులు విజయవాడ కేంద్రంగా చేసుకుని గంజాయి రవాణాకు పాల్పడుతున్నట్లు వెల్లడైంది. పాడేరు నుంచి తీసుకువచ్చి విజయవాడ సత్యనారాయణపురం పోలీస్టేషన్ పరిథిలో డంప్ చేస్తున్నారు. వీలుంటే నేరుగా అనుకున్న ప్రాంతాలు, పొరుగు రాష్ట్రాలకు చేరవేస్తున్నారు. ఇందుకు సంబంధించి నగదు చేతులు మారాక ‘పైలెట్’ పర్యవేక్షణలో నగరం సరిహద్దులు దాటిస్తున్నారు. వీలు కాని పక్షంలో నగరంలో సరుకు దించి మరుసటి రోజు తరలించే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పుడు పట్టుబడిన గంజాయిని ఢిల్లీ, చెన్నై, ముంబయి ప్రాంతాలకు తరలిస్తున్నట్లు ప్రాధమిక విచారణలో వెల్లడైంది. కాగా.. దొరికిన గంజాయి సీజ్ చేసి అదుపులోకి తీసుకున్న ముగ్గురు వ్యక్తుల నుంచి పూర్తి సమాచారం కోసం ఆరా తీస్తున్నారు.

సంతానం కోసం రెండో పెళ్లికి రెడీ!
* అడ్డుకున్న వన్‌టౌన్ పోలీసులు
* నిందితుల అరెస్టు
* చిలకలూరిపేట పోలీసులకు అప్పగింత
పాతబస్తీ, డిసెంబర్ 10: ప్రేమించి వివాహమాడిన ఇల్లాలికి సంతానం కలుగలేదంటూ మరో పెళ్లికి సిద్ధమైన యువకుని యత్నాలు వమ్మయ్యాయి. భార్య ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు శనివారం తెల్లవారుఝామున అతన్ని అడ్డుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన దుర్గా ప్రవీణ్‌నాయక్(30) గతంలో హైదరాబాద్‌లో ఉండగా స్వరూప(26)ని ప్రేమించి సీతాఫల్‌మండిలోని ఆర్య సమాజంలో వివాహమాడాడు. రెండేళ్లుగా అక్కడే కాపురమున్నారు. అనంతరం గుంటూరుకి మకాం మార్చాడు. అతనికి వివాహమైన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పలేదు. అలాగే భార్యనూ తనింటివాళ్లకు పరిచయం చేయలేదు. గుంటూరులో మిర్చి వ్యాపారం చేసే నాయక్‌ని వివాహం చేసుకోమని తల్లిదండ్రులు ఒత్తిడి చేశారు. అయితే తనకు వివాహమై తొమ్మిదేళ్లు అయిందని అసలు విషయం బయటపెట్టాడు. అయితే ఇంకా సంతానం లేనందున వంశాంకురం కోసం మరో యువతిని వివాహం చేసుకోవాలని వుందని నాయక్ నిర్ణయాన్ని తల్లికి చెప్పాడు. ఆమె గుంటూరులోని స్వరూప వద్దకు వచ్చి నయానో భయానో చెప్పి నాయక్ రెండో వివాహానికి ఒప్పించింది. చిలకలూరిపేటకే చెందిన ఓ యువతితో పెళ్లి కుదుర్చుకున్నారు. మొదటి వివాహం విషయాన్ని రహస్యంగా ఉంచారు. వివాహం చేయడానికి నిశ్చయించి నూతన వధువు, రెండో వివాహం వరుడు, అతని మొదటి భార్య స్వరూప, కొందరు బంధువులు ఓ ట్రావెల్ వాహనంలో శుక్రవారం రాత్రి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకున్నారు. తానుండగానే తన కళ్లముందే భర్త మరో యువతి మెడలో తాళికట్టే సన్నివేశాన్ని జీర్ణించుకోలేకపోయిన స్వరూప చివరికి దుర్గగుడి నుండి పరుగున వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు చేరింది. తనకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించింది. పోలీసులు వెంటనే గుడి వద్దకు వెళ్లి వివాహాన్ని అడ్డుకున్నారు. రెండు కుటుంబాల పెద్దలను అదుపులోకి తీసుకున్నారు. తమ తెగలో రెండో పెళ్లి తప్పుకాదని నాయక్ తల్లి చెప్పినా ఇది తెగలకు సంబంధించిన అంశం కాదని, స్వరూప ఫిర్యాదు చేసింది కనుక చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. సిఐ కాశీవిశ్వనాథ్ గుంటూరు జిల్లా ఎస్పీతో సంప్రదించి నిందితులను చిలకలూరిపేట పోలీసులకు అప్పగించారు. మొదటి భార్యను బెదిరించి వివాహానికి బలవంతంగా అంగీకరింపజేశారని బాధితులు, నిందితులు చిలకలూరిపేట వారు కనుక కేసు నమోదు చేయకుండా అక్కడ పోలీసులకు అప్పగించామని సిఐ వివరించారు.