విజయవాడ

వార్ధా తుఫాన్‌పై జిల్లాలో ముందస్తు జాగ్రత్తలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 10: వార్ధా తుఫాన్ తీరాన్ని దాటే సమయంలో జిల్లా యంత్రాంగం ద్వారా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలో తుఫాన్ పరిస్థితిపై కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ నుంచి శనివారం ముఖ్యమంత్రి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 12న సాయంత్రం 5 నుండి 10 గంటల లోపు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట, కృష్ణపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశముందని ఇస్రో అధికారులు తెలియజేశారని, దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తీరం వెంబడి అధికారులను అప్రమత్తం చేసిందని, తుఫాను తీరం దాటే సమయంలో కృష్ణా జిల్లాలో ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారని మంత్రులు ఉమ, రవీంద్ర ముఖ్యమంత్రికి వివరించారు.