విజయవాడ

సిఎం దృష్టికి 010 జీవో జీతాల సమస్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మే 17: విఎంసిలో పనిచేసే ఉద్యోగులందరికీ ప్రభుత్వమే నేరుగా 010 జీవో ద్వారా జీతాలను విడుదల చేసేలా అవసరమైన చర్యలు తీసుకుంటానని నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం తన చాంబర్‌లో కలిసిన మినిస్టీరియల్ ఎంప్లారుూస్ అసోసియేషన్ కార్యదర్శి జి అజయ్‌కుమార్, ఉపాధ్యక్షురాలు ఐ విజయలక్ష్మితో మాట్లాడుతూ 010 జీతాల ఫైలు విషయం సిఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్ళి సత్వరమే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు. 1981 సంవత్సరంలో కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ అయిన విఎంసి అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎన్ని పోస్టులు మంజూరయ్యాయి, ప్రస్తుతం ఎన్ని పోస్టుల్లో ఉద్యోగులు పనిచేస్తున్నారు, ఇంకెన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయన్న విషయంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని మేయర్ ఉద్యోగ సంఘ నాయకులకు సూచించారు. 010 జీవో ద్వారా జీతాలు ప్రభుత్వమే భరిస్తే విఎంసి ఖజానాపై ఆర్థిక భారం తప్పుతోందన్నారు.