విజయవాడ

కెనరా బ్యాంకు ఖాతాదారులకు మరిన్ని సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, జనవరి 13: నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగలను పురస్కరించుకొని కెనరా బ్యాంకు ఖాతాదారులకు మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకురాన్నుట్లు కెనరా బ్యాంకు సర్కిల్ హెడ్, జనరల్ మేనేజర్ పులి సాయిబాబు తెలిపారు. శుక్రవారం ఆయూష్ హాస్పిటల్ సమీపంలోని నాగార్జున నగర్ కెనరా బ్యాంకులో జరిగిన ఖాతాదారుల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ అన్ని బ్రాంచిలను కంప్యూటరైజ్డ్ చేయనున్నట్లు చెప్పారు. సామాజిక సేవలో భాగంగా కెనరా బ్యాంకు రామవర్పాడు జిల్లా పరిషత్ హైస్కూల్‌లోని ఎస్‌సి, ఎస్‌టి కేటగిరికి చెందిన ప్రథమ శ్రేణి విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.5వేలు చొప్పున నలుగురు విద్యార్థులకు రూ.20వేలను స్కాలర్‌షిప్‌లు అందచేశారు. ఈ కార్యక్రమంలో కెనరా బ్యాంకు సర్కిల్ డిజిఎం కె.సుశీల, ఎజిఎం ఆర్.లక్ష్మయ్య, బ్రాంచి మేనేజర్ ఎస్.లక్ష్మీకుమార్, బ్యాంకు ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇంటర్ విద్యార్థిని అనిత ఆత్మహత్య కేసులో ఇద్దరి అరెస్ట్
పాతబస్తీ, జనవరి 13: రెండు సంవత్సరాల ప్రేమాయణం, ప్రియుడు మనస్సు కాదు తనువు కావాలన్నాడు. మనువు కాదన్న ప్రియుడు. ఒక పక్క ఇష్టంలేని బావతో పెళ్లి మంతనాలు మరోపక్కన ప్రేమాయణం బయటపడితే చదువు మాన్పిస్తారనే భయం వెరసి మానసిక వత్తిడికి గురైన ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తేల్చారు. ఆమె బలవన్మరణానికి కారణమైన మైనరుని, ఆమె మేనత్త కుమారుడిని కొత్తపేట పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పాతబస్తీలో వెస్ జోన్ ఎసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో నార్త్ మహిళా ఎసిపి కె.శ్రావణి ఈ వివరాలు వెల్లడించారు. తమ దర్యాప్తులో బయట యువకులెవ్వరూ ఆమెను వేధించలేదని, పదో తరగతి నుండి ఓ బాలుడు అనిత ప్రేమించుకుంటున్నారు. విషయం గ్రహించిన తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేయాలని తలచారు. మేనత్త కుమారుడు రూపేష్ ను ఇచ్చి చేయాలని చెప్పారు. అతనిని చేసుకోవడం ఇష్టం లేక, ప్రియుడిని వదులుకోలేక మానసిక ఘర్షణకు గురైందని ఎసిపి శ్రావణి వివరించింది. ఇటీవల అనిత తన ప్రియునితో ఒంటరిగా మాట్లాడుతుండగా అతను ఆమెను లొంగదీసుకోవాలని యత్నించాడు. అనిత నిరాకరించింది. అప్పటివరకు ప్రేమ కబుర్లు చెప్పిన ప్రియుడు తనని కేవలం శారీరకంగా కోరుకున్నాడని, అసలైన ప్రేమ కాదని గ్రహించింది. పైగా అనిత స్నేహితురాళ్లతో ఇక నుండి తనతో మాట్లాడవద్దని ప్రియుడు తేల్చి చెప్పాడు. ఈ తంతును గమనించిన అనిత మేనత్త కొడుకు రూపేష్ అనిత వద్ద గల ప్రేమలేఖలు, విషయాన్ని అడ్డం పెట్టుకుని ఆమెను లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు. బావ బ్లాక్ మెయిలింగ్, ప్రియుడు నిరాకరణతో నలిగిపోయిన అనితకు జీవితంపై విరక్తి కల్గింది. దాంతో ఈ నెల 10న ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ కేసులో అసలు నిందితులను పట్టుకోవాలని దర్యాప్తు వేగిరం చేసిన పోలీసులకు అనిత ఆటోలో ఎలాంటి అనుభవాలు ఎదుర్కోలేదని తేలింది. అనిత డైరీని పరిశీలించిన దర్యాప్తు అధికారులు అనిత ప్రియునితో సంభాషణలు, ఫోను డేటాను రాబట్టారు. అలాగే రూపేష్ ఆమెను ఎలాంటి వేధింపులకు గురి చేసింది గ్రహించారు. దాంతో అసలు విషయం బహిర్గతమైందని ఎసిపి శ్రావణి వివరించారు. మృతురాలి ప్రియుణ్ణి అరెస్టు చేసి జువనైల్ హోమ్‌కు తరలించారు. విలేఖర్ల ఎదుట మరో నిందితుడు రూపేష్‌ని ప్రవేశపెట్టారు. ఈ సమావేశంలో వెస్ట్ జోన్ ఎసిపి జి.రామకృష్ణ, కొత్తపేట సిఐ దుర్గారావు, ఎస్‌ఐ మూర్తి తదితరులు పాల్గొన్నారు.