విజయవాడ

అలరించిన సింహనృత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 13: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా జరిగిన సంక్రాంతి సంబరాల్లో ఇన్‌స్పెక్టర్ జనరల్ రవిచంద్ర కుమార్తె ప్రదర్శించిన సింహం, నందిని నృత్య రూపకం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. అద్భుతమైన రంగుల ప్రసారాల మధ్య దాదాపు 20 నిమిషాలు పైగా సాగిన ఈ నృత్యం ఆహూతులను కట్టిపడేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా ఈ నృత్యాన్ని ఆసక్తిగా తిలకించడమే కాకుండా తండ్రి బాటలోనే ఐపిఎస్ అధికారిణి కాగలదంటూ ఆశీర్వదించారు.

నగరాల సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
పాతబస్తీ, జనవరి 13: మన సాంప్రదాయాలు, సంస్కృతులు మరిచిపోని విధంగా కృష్ణాజిల్లా నగరాల సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం ఎంతో ఆనందదాయకం అని రాష్ట్ర నగరాల సంఘం అధ్యక్షుడు బాయన వెంకటరావు, బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతిన వెంకటమహేష్, టిడిపి రాష్ట్ర నాయకులు కె.నాగుల్‌మీరా అన్నారు. శుక్రవారం పాలఫ్యాక్టరీ ఆవరణలోని ఫంక్షన్ హాల్ నందు ముగ్గుల పోటీలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ కృష్ణాజిల్లా నగరాల సంఘం నిర్వహించిన సంక్రాంతి సంబరాలను చూస్తుంటే గత 30 సంవత్సరాల పండుగ వాతావరణం నెలకొందని నేడు ఇక్కడ నిర్వహించిన కార్యక్రమాలు గంగిరెద్దుల ఆట, డూడూ బసవన్న వంటి కార్యక్రమాలు, మహిళలు, చిన్నారులు ముగ్గుల పోటీల్లో పాల్గొని తమదైన శైలిలో నిర్వహించారని అన్నారు. నాటి తరం పెద్దలు నిర్వహించిన పండుగలను రాబోయే భావితరాల వారికి ఎంతగానో గుర్తుండే విధంగా ఇక్కడ కార్యక్రమాలను నిర్వహించారని ప్రతి ఒక్కరూ స్వచ్ఛంద సంస్థలు వంటి వారు ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తుంటే భావితరాల వారికి ఈ సాంప్రదాయాల కట్టుబాట్లు ఉంటాయని అన్నారు.
కృష్ణాజిల్లా నగరాల సంఘం అధ్యక్షుడు గూడేల శీను సభకు అధ్యక్షత వహించగా, 31, 32 డివిజన్ల కార్పొరేటర్లు నాగోతి నాగమణి, కొరికాని అనురాధ, సీనియర్ తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు బంకా నాగమణి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి అర్బన్ ప్రధాన కార్యదర్శి గనె్న వెంకట ప్రసాద్, ప్రముఖ పారిశ్రామికవేత్త బాయన బాబూజీ, శ్రీ నగరాల శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం అధ్యక్షుడు బేసు కంఠేశ్వరుడు, కృష్ణాజిల్లా నగరాల సంఘం ప్రధాన కార్యదర్శి తమ్మిన వెంకటరమణ, రుూది ఎల్లారావు, పణుకు శేషగిరిరావు తదితరులు హాజరయ్యారు. 2016లో ప్రభుత్వ ఉద్యోగం నుండి పదవీ విరమణ చేసిన ఉద్యోగులను, 60 సంవత్సరాలు నిండిన దంపతులకు షష్ఠిపూర్తి మహోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలతో ఈ మహోత్సవాన్ని నిర్వహించారు.