విజయవాడ

ఘనంగా సామూహిక భోగిమంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (బెంజిసర్కిల్), జనవరి 13: ఆవు పిడకలతో సామూహిక భోగి మంటల కార్యక్రమాన్ని అమరావతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బెంజిసర్కిల్ ఆంజనేయస్వామి గుడివద్ద ఘనంగా ని ర్వహించారు. ఈ సందర్భంగా కార్యనిర్వాహక కార్యదర్శి కిసాన్ సంఘ్ అధ్యక్షు డు మాట్లాడుతూ ఆవు పిడకలతో భోగిమంటలు వేయడం వలన వాతావరణంలో కాలుష్యాన్ని నివారించడమే కాక, ఆవు పెంపకందారులను ప్రోత్సహించినట్లు అవుతుందని తెలిపా రు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్, పార్లమెంటు సభ్యుడు గోకరాజు గంగరాజు, శాసనసభ్యుడు గద్దె రామ్మోహనరావులు సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడాన్ని ప్రశంసించారు. తదనంతరం గంగిరెద్దులాడించే వారికి, హరిదాసులకు సన్మానం చేశా రు.రంగురంగుల హరివిల్లులు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసులపాట లు భక్తులను ఆకట్టుకున్నాయి. కార్పొరేటర్లు చెన్నుపాటి గాంధీ, జాస్తి సాంబశివరావు, బొప్పన భవకుమార్, డా.రామారావు, అనుమోలు గాంధీ, వల్లభనేని ఆశాకిరణ్, డా.ఉ మామహేశ్వర రాజు నాయకులు పాల్గొన్నారు.

ముగ్గుల పోటీలు
పాతబస్తీ, జనవరి 13: ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన బాహుబలి ప్రభాస్ ఫ్యాన్స్ నిర్వహించిన ముగ్గుల పోటీ వినూత్న ఒరవడిని సృష్టిస్తుందని స్థానిక కార్పొరేటర్ నర్సింహారావు అన్నారు. కృష్ణలంక 23వ డివిజన్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం ఉదయం జరిగిన ముగ్గుల పోటీ విజేతలకు ఆయన బహుమతుల ప్రదానం చేశారు. కృష్ణాజిల్లా రెబల్‌స్టార్ కృష్ణంరాజు, యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. వందలాది మంది ఈ పోటీల్లో పాల్గొనగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు మరో 14 మందికి కన్సొలేషన్ బహుమతులు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న కార్పొరేటర్ నర్సింహారావు, 24వ డివిజన్ కార్పొరేటర్ చందన సురేష్, కొరగంజి శేఖర్‌బాబు మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ కొరగంజి జగన్, న్యాయనిర్ణేతలు లయన్ ధారా కరుణశ్రీ, జాతీయ ఈత పోటీల అవార్డు గ్రహీత విజయశ్రీగుప్తా, రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి పోతిన వెంకట మహేష్‌ల చేతుల మీదుగా బహుమతులు అందించారు. వైవి రమణ సభాధ్యక్షులుగా వ్యవహరించారు. ఆర్గనైజర్లు పట్నాల హరిబాబు, జోగిశెట్టి సురేష్, గంగాధర్, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. కాగా ప్రథమ బహుమతి విజేతకు రూ.5వేల చెక్కును అందించారు. ద్వితీయ, తృతీయ విజేతలకు ప్రెషర్ కుక్కర్, మిక్సీలు అందించారు. ఈ ముగ్గురు విజేతలకు త్వరలో ప్రభాస్ చేతుల మీదుగా మరోమారు ప్రత్యేక బహుమతులు అందించటం జరుగుతుందని పట్నాల హరిబాబు సభాముఖంగా ప్రకటించారు. కొరగంజి శేఖర్‌బాబు మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ కొరగంజి జగన్ చేతుల మీదుగా చిన్నారులకు నోట్‌బుక్స్, పెన్నులు అందించారు.