విజయవాడ

కాలు దువ్వుతున్న కోళ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంజిసర్కిల్, జనవరి 13: అగ్గిపుల్లా... సబ్బు బిళ్ల ...కాదేదీ కవితకు అనర్హం రీతిలో జూదానికి కూడా కాదేదీ అనర్హం అంటూ సంక్రాంతి సంబరాల పేరిట జూదం హద్దులు దాటింది. కోడిపందాలు..పొట్టేళ్ల పందాలు..పేకాట...ఇలా అన్నింటిని కలపి పందెం రాయుళ్లకు అందుబాటులో ఉంచారు. తమ అభిమాన నాయకులు...హీరోలు...దేవుళ్లనే సాక్ష్యంగా పెట్టి వారిపైనే పందాలను ఏర్పాటు చేయడం గమన్హాం. జూదం కోసం వచ్చే వారికి సపర్యలు అందించేందుకు గాను వారికి అందుబాటులో మందు...విందులను సైతం లోటు లేకుండా అన్ని వారి దగ్గరకే అందించే ఏర్పాట్లు సైతం చేశారు. ఇన్ని కలగలిసి లభిస్తోన్న ప్రాంతం మాత్రం విజయవాడ నగరానికి కాస్త దూరంలోని ఈడుపుగల్లులో ఉంది. సంక్రాంతి సంబరాల నేపథ్యాన్ని చూపిస్తూ దాని మాటున పెద్దన జూదానికి తెరలేపిన వైనం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. పందాల కోసం సుమారు 50ఎకరాల్లోని పొలాలను చక్కగా చదును చేయడంతో పాటు పందెం ప్రాంతాన్ని మొత్తం కట్టుదిట్టమైన ఫెన్సింగ్‌ను సైతం తాత్కలికంగా ఏర్పాటు చేశారు. నూతన టెంట్లను, రాత్రి సమయంలో సైతం వీలుగా ఉండేందుకు గాను లైట్లను, జనరేటర్లను ఏర్పాటు చేశారు. అలాగే ఏర్పాట్లను పర్యవేక్షించడంతో పాటు ఎటువంటి అంతరాలకు తావివ్వకుండా చూసేందుకు వంద మందితో ప్రైవేట్ సైన్యాన్ని సైతం ఏర్పాటు చేయడం విస్తుగొలిపే అంశం. ఏర్పాట్లన్నీ కొంతమంది ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో జరగడం, వారే ఈ పోటీలను ప్రారంభించడం గమనార్హం. నోట్ల రద్దు ప్రభావం మాత్రం ఇక్కడా ఒక్కసారి కూడా కానరావడం లేదు కదా...చిల్లరకు కూడా ఎక్కడా ఇబ్బందులు తలెత్తకపోవడం మరో విశేషం. రూ.10 దగ్గర నుండి రెండు వేల రూపాయల నోట్ల వరకు లక్షల రూపాయలు క్షణాల్లో చేతులు మారుతున్నాయి. అలాగే పందెం కోసం వచ్చిన వారి దగ్గర డబ్బులు లేని పక్షంలో స్వైపింగ్ మిషన్లను సైతం అందుబాటులో ఉంచారంటే జూదం ఏ స్థాయికి వెళ్లిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. జూదానికి సంబంధించి నాయకులు, హీరోలు, దేవుళ్ల ఫొటోలను పెట్టి పేక ముక్కలతో పందెం రాయుళ్లను రెచ్చగొట్టి మరీ వారితో జూదానికి ప్రేరేపిస్తున్నారు. కేవలం చూడడానికి వచ్చిన వారిని ఆకర్షించుకునే రీతిలో జరిగిన ఏర్పాట్లు వెళ్లిన తరువాత మన అదృష్టాన్ని పరీక్షించుకుందాం అని జూదం ఆడే స్థితికి వచ్చేలా చేస్తున్నారు. ఇందులో చిన్నా...పెద్ద..ముసలి..ముతకా...అడ...మగ అనే తేడా లేకుండా అందరూ పాల్గొంటున్నారు. చదువుకున్న వారి దగ్గర నుంచి మొదలు చదువురాని వారి వరకు అందరూ జూదానికి ప్రేరేపించే విధంగా ఉన్నాయి. మహిళలు సైతం జూదంలో ప్రముఖంగా కనిపిస్తున్నాంటే పరిస్థితిని ఎలా ఉందో చెప్పనక్కరలేదు. అలాగే వచ్చిన వారికి నచ్చిన వంటకాలను సైతం అక్కడిక్కడే లభిస్తున్నాయి. వీటితో పాటు మద్యానికి అసులు కొదవే లేదు. సంక్రాంతి ప్రారంభం రోజు శుక్రవారం భోగి రోజున వేల మంది ఈ వినోదాలను చూసేందుకు, అడేందుకు గాను విజయవాడతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు, జిల్లాలు, రాష్ట్రాల నుండి తరలి రావడంతో వారి వాహనాలతో రహదారులు పోలాలు నిండి పోయాయి. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకంగా పార్కింగ్ ప్రదేశాలను సైతం ఏర్పాటు చేసి వాటి ఫీజులను సైతం తీసుకుంటున్నారు. ఒక్క ఈడుపుగల్లుకే పరిమితం కాని ఈ పందాలు నగర పరిధిలోని అన్ని గ్రామాల్లో కూడా జరుగుతోంది. యనమలకుదురుతో పాటు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో జరుగుతున్న ఈ పందాలకు కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రత్యేకంగా ఎంట్రీ టిక్కట్లను కూడా వసూలు చేస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ఎంట్రీ ఫీజు రూ.500లు వసూలు చేసినట్లు భోగట్టా. ఇక కోడి పందాలు జరుగుతున్న గిరిలోకి వెళ్లాలంటే స్పెషల్ పాస్‌లు మాత్రం ఉండాలి. పాస్‌లు లేకుండా లోనికి వెళ్లాలని ప్రయత్నిస్తే మాత్రం ప్రైవేటు సైన్యం చేతిలో ఉన్న కొరడాతో దెబ్బలు తినాల్సిందే. ఇంత జరుగుతున్న పోలీసులకు మాత్రం ఎమీ తెలియనట్టే ఉంటూ, అటు వైపు కనె్నత్తి కూడా చూడక పోవడంతో జూదం రాత్రి, పగలు తేడా లేకుండా నిరాటంకంగా కొనసాగిపోతుంది. పండగ మాటెలా ఉన్న పందెంలో మాత్రం లక్షల రూపాయలు పోగొట్టుకున్న వారే ఎక్కువుగా ఇక్కడ కనిపిస్తున్నారు.

సిద్ధార్థ స్కూల్‌లో సంక్రాంతి సంబరాలు
* తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు సంక్రాంతి ప్రతీక
పటమట, జనవరి 13: తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలకు మన పండుగులు ప్రతీకలని శాసనసభ్యులు గద్దె రామమోహన్ అన్నారు. శుక్రవారం తెల్లవారుజామున సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ వాకర్స్ అసోసియేన్ ఆధ్వర్యంలో మెగాగ్రాండ్ వాక్ జరిగింది. అనంతరం సభ్యులు ఎంతో ఉత్సహంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గద్దె మాట్లాడుతూ వ్యాయామం వలన శారరీక శ్రమ జరిగి రోజంతా ఉత్సహంగా ఉండవచ్చన్నారు. రోజు ఉదయం ఒక గంట సేపుచేసే వ్యాయామం వల్ల శారరీంలోని వ్యర్థాలన్నీ చెమట రూపంలో బయటకు వస్తాయన్నారు. దానివల్ల ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు. 20 ఏళ్లుగా ప్రతి ఏడాది భోగి రోజు తెల్లవారుజామున మెగా వాక్ నిర్వహిస్తున్నామని చెప్పారు. అన్ని మతాలు, కులాలు సంతోషంగా జరుపుకునే పండుగ సంక్రాంతి అన్నారు. అంతరించిపోతున్న మన సంప్రదాయాలకు ముందు తరాలవారికి తెలియజేయటానికి సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. సిద్ధార్థ పబ్లిక్ స్కూల్‌లో వాకింగ్ చేసే వారిలోక్రమం తప్పకుండా సమయానికి వచ్చే మహిళా వాకర్స్ కామినేని మాధవి, దాసరి శ్రీదేవి, నల్లూరి ఆషా, లంకా నాగమల్లికకు ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున రూ.40 వేలు పోత్సాహం గద్దె ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ వాకర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక చైర్మన్, పారిశ్రామికవేత్త ధనేకుల రవీంద్రనాధ్ ఠాగూర్, అసోసియేషన్ అధ్యక్షుడు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు సంక్రాంతి సంబరాలలో హరిదాసులు, భోగిమంటలు, గంగిరెద్దుల విన్యాసాలు, కోడి పందాలతో సిద్ధార్థ స్కూల్ ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొంది.