విశాఖపట్నం

ఇసుక రీచ్‌లకు టెక్నికల్ అసిస్టెంట్ల నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 26: ఉచిత ఇసుక విధానంలో భాగంగా జిల్లాలో గుర్తించిన రీచ్‌లకు టెక్నికల్ అసిస్టెంట్లను నియమిస్తూ సంయుక్త కలెక్టర్ జె నివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ఇసుక రీలకు నీటి పారుదల శాఖ ఇంజనీర్లను ఇన్‌ఛార్జ్‌లుగా నియమించిన ప్రభుత్వం వీరికి సహాయకులుగా ఉండేందుకు టెక్నికల్ సహాయకులను నియమించినట్టు జెసి నివాస్ తెలిపారు. ఇన్‌ఛార్జ్‌లు, టెక్నికల్ సహాయకులతో కలెక్టరేట్‌లో శనివారం సమావేశం నిర్వహించిన జెసి మాట్లాడుతూ జిల్లాలో చోడవరం మండలం జుత్తాడ, లక్కవరం, గౌరీపట్నం, వి మాడుగుల మండలం జెపి పేట, సాగరం, ఎస్ రాయవరం మండలం సోమిదేవిపల్లి, మాకవరపాలెం మండలం నారాయణరాజు పేట, యలమంచిలి మండలం ఏటికొప్పాక, కోటవురట్ల మండలం పండూరు, గొట్టివాడ, కొత్తగొట్టివాడ, కైలాసపట్నం, చౌడువాడ, పెదబయలు మండలం మంగబండ, రీచ్‌లకు టెక్నికల్ సహాయకులను నియమించారు. టెక్నికల్ సహాయకులకు కేటాయించిన రీచ్‌లలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ నిఘా ఉంచి, చట్టబద్దంగా ఇసుక తవ్వకాలను మాత్రమే అనుమతించాలని ఆదేశించారు. ఇసుక తవ్వకాలు, రవాణా తదితర అంశాలను ఎప్పటికప్పుడు ట్యాబ్‌ల ద్వారా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. అనుమతించిన రీచ్‌ల్లో మీటరు లోతు వరకూ మాత్రమే తవ్వకాలు జరిగేలా చూడాలన్నారు. వ్యక్తిగత అవసరాల నిమిత్తం వచ్చే వారి అనుమతులను పరిశీలించిన మీదటే అనుమతులివ్వాలని, అలాగే ప్రభుత్వ పనులను చేపట్టే కాంట్రాక్టర్లకు తహశీల్దార్లు జారీ చేసే కూపన్ల ఆధారంగా అనుమతులు మంజూరు చేయాలని ఆదేశించారు. అక్రమంగా ఇసుక తవ్వకాలకు పాల్పడటంతో పాటు విక్రయాలకు పాల్పడుతున్న వారి వివరాలను ఎప్పటికప్పుడు పోలీసులు, తహశీల్దార్లకు నివేదించాలన్నారు. వ్యక్తిగత అవసరాల కోసం వచ్చే వారి నుంచి క్యూబిక్ మీటర్‌కు రూ.100 చొప్పున వసూలు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం అనుమతించిన ఇసుక రీచ్‌లకు సరిహద్దులను తెలిపే విధంగా కాంక్రీట్ పిల్లర్లను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో డ్వామా పథక సంచాలకులు శ్రీరాములు నాయుడు, గనుల శాఖ సహాయ సంచాలకులు జివివిఎస్ చౌదరి, సూర్యచంద్రరావు, అసిస్టెంట్ జియాలజిస్టు విజయలక్ష్మి, ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖల ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.