విశాఖపట్నం

త్వరలో అరకు అద్దాల రైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 26: చాలా కాలంగా ఊరిస్తున్న అరకుకు అద్దాల రైలు కల త్వరలో నెరవేరనుంది. అయితే అద్దాల రైలు కాకుండా ముందుగా రెండు బోగీలతో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని విశాఖ ఎంపి కె.హరిబాబు తెలిపారు. ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్సు సమ్మిట్‌లో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో శనివారం మాట్లాడుతూ విస్టాడోమ్‌గా వ్యవహరించే ఈ అద్దాల బోగీలు రెండు తయారు చేస్తున్నారని, త్వరలో అవి అందుబాటులోకి రావచన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను ఈ విషయమై 15 సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్నానని, కానీ ఇప్పటి వరకూ అది కార్యరూపం దాల్చలేదన్నారు. ప్రస్తుతం నడుస్తున్న విశాఖ-అరకు రైలుకే ఈ బోగీలను జత చేసి నడుపుతారని తెలిపారు. భోగీలు సిద్ధం కాగానే అందుబాటులోకి వస్తుందని తెలిపారు. విశాఖ విమానాశ్రయంలో ఇంటర్నేషనల్ కార్గో హ్యాండ్లింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుతూ రెండు సంవత్సరాలుగా ఈ అంశంపై అధికారుల వెంట పడినా ఇంకా అందుబాటులోకి రాలేదని తెలిపారు. ఒక సారి టెండరు దక్కించుకున్న సంస్థ పనులు ప్రారంభించకుండానే లాభసాటిగా లేదని వెనక్కి వెళ్లిపోయిందని తెలిపారు. పనులు ప్రారంభించకుండానే లాభం లేదని ఎలా వెళ్లిపోతుందని, ఇదే సంస్థ డొమెస్టిక్ కార్గొను నిర్వహిస్తున్నదని గుర్తు చేశారు. విమానాశ్రయ అధికారులు మరోసారి టెండరు పిలిచామని చెపుతున్నారని తెలిపారు. నిబంధనలు సడలించడం లేదా ఆసక్తి ఉన్న స్థానికులకు అవకాశం కల్పించాలని కోరినట్లు తెలిపారు.