విశాఖపట్నం

నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 26: జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఆదివారం నిర్వహించనున్నట్టు సిఇఒ జయప్రకాష్ నారాయణ తెలిపారు. ఉదయం 11 గంటలకు చైర్‌పర్సన్ లాలంభవానీ అధ్యక్షతన సమావేశం ఉంటుందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సర్వసభ్య సమావేశంలో పాల్గొనాలని ఆయన తెలిపారు.

జెనెటిక్ కౌనె్సలింగ్‌లో డిప్లమో కోర్సు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మార్చి 26: ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని జెనెటిక్ కౌనె్సలింగ్‌లో డిప్లమో కోర్సు, పిజి డిప్లమో ఇన్ పబ్లిక్ రిలేషన్స్ కోర్సును ఈ ఏడాది నుంచి నిర్వహించనున్నారు. శనివారం ఎయులోని సెనేట్ మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జి వైస్ ఛాన్సలర్ నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో బ్లాక్ గ్రాంట్ కింద రూ.298.25 కోట్లు కేటాయించిందని తెలిపారు. అలాగే 282 అద్యాపక ఉద్యోగాల నియామకానికి ఆమోదం తెలిపిందని చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావులకు కృతజ్ఞతలు తెలిపారు. నాక్‌లో ఎయు అత్యుత్తమ స్థానం సంపాదించడంలో కృషి చేసిన మాజీ విసి జిఎస్‌ఎన్ రాజు, ఇతర సభ్యులను సెనేట్ సమావేశంలో అభినందనలు తెలిపారు. ఇసి సభ్యుల నియామకం వల్ల వర్శిటీకి విలువైన సూచనలు అందుతున్నాయన్నారు.
ఇదిలా ఉండగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం యూనివర్శిటీకి తాత్కాలికంగా ఎయు ఇంజనీరింగ్ కళాశాలలో సౌకర్యం కల్పించామని విసి నారాయణ తెలిపారు. అలాగే నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్‌తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు సంయుక్తంగా పనిచేస్తామన్నారు. ఇప్పటికే ఆ వర్శిటీ డైరెక్టర్ ఎయును సందర్శించిన విషయాన్ని గుర్తు చేశారు. యూజిసి కెమికల్ ఇంజనీరింగ్‌కు రూ.2.39 కోట్లు, ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీకి రూ.54 లక్షలు, ఇనార్గనిక్, అనలిటకల్ కెమిస్ట్రీకి రూ.1.36 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. త్వరలో హెచ్‌ఆర్‌డి నుంచి రూసా నిధులు విడుదల కానున్నాయన్నారు. కాగా, యూనివర్శిటీ విత్ పొటెన్షియల్ ఫర్ ఎక్స్‌లెన్స్ సాధించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సమావేశంలో ఇతర వర్శిటీలకు విసిలుగా నియమితులైన ఎ.రాజేంద్రప్రసాద్, ఎస్.రామకృష్ణారావు, ఎంఎస్ ప్రసాదరావు, బిసి కమిషన్ సభ్యులుగా నియమితులైన పూర్ణచంద్రరావు, సత్యనారాయణ, సుబ్రహ్మణ్యంలను అభినందించారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఎం.సుందరరావు మాట్లాడుతూ వార్షిక నివేదికను సభ్యులకు వివరించారు. 408 మంది డాక్టరేట్‌లు, 592 మంది ఎంటెక్, ఎంఫిల్, ఎంఫార్మ, ఎల్‌ఎల్‌ఎంలు అందుకున్నారన్నారు. 86 కార్పొరేట్ సంస్థలు వర్శిటీలో 1136 మందికి ఉపాధి అవకాశాలు కల్పించిందన్నారు. పాలకమండలి సభ్యులు ఎం.ప్రసాదరావు వార్షిక ఆర్థిక నివేదికను సమర్పించారు. బిబిఎం కోర్సును బిబిఎగా మార్పు చేశారు. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ కోర్సులో 9 స్పెషలైజేషన్లను ఏర్పాటు చేస్తూ అందుకు అనుగుణంగా సర్ట్ఫికేట్లను అందించనున్నారు. సిబిసిఎస్ విధానంలో కామన్‌గ్రేడింగ్ విధానానికి సెనేట్ ఆమోదం తెలిపింది. జపనీస్, సాఫ్ట్‌స్కిల్స్, డిప్లమో ఇన్ జర్నలిజం సిలబస్,. పరీక్షల విధానానికి సెనేట్ ఆమోదం లభించింది. ఈ సమావేశంలో రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు, మాజీ విసిలు కె.రామకృష్ణారావు, కెవి రమణ, వైసి సింహాద్రి, బీల సత్యనారాయణ, జిఎస్‌ఎన్ రాజు, ఇసి సభ్యులు బాబయ్య, విజయరవీంద్ర, శశిభూషణరావు, ఎస్‌వి ఆదినారాయణ, చిట్టినేని సురేష్ తదితరులు వివిధ అంశాలపై చర్చించారు.

జైలు అదాలత్‌లో 14 కేసులు పరిష్కారం
ఆరిలోవ, మార్చి 26: విశాఖ కేంద్ర కారాగారంలో శనివారం రెండవ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ జడ్జి షమీ పర్వీన్ సుల్తానాబేగమ్ 14 కేసులను పరిష్కరించారు. 24 కేసులు పరిశీలించిన ఆమె ఇరుపక్షాల సమస్యలు నేరుగా విన్న మీదట ఆమె వీటిలో 14 కేసులను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో కారాగారం సూపరింటెండెంట్ డాక్టర్ ఇండ్ల శ్రీనివాస్, అధికారులు, జైలు సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చైతన్య సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఖైదీలు ఏ విధంగా సేవలను సద్వినియోగపర్చుకోవాలో వివరించారు. జిల్లా మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి నందికొండ నరసింగరావు, రెండవ ఏజెసిజె జి.చక్రపాణి, జిల్లా లీగల్ సర్వీసు అథారిటీ కార్యదర్శి ఆర్‌వి నాగసుందర్ పాల్గొన్నారు.

అరకులోయ రహదారి విస్తరణపై సర్వే
అరకులోయ, మార్చి 26: ఆంధ్రా ఊటీ అరకులోయ రహదారి విస్తరణపై సర్వే జరుగుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఇంజనీరింగ్ సిబ్బంది సర్వే చేపడుతున్నారు. ఈ ప్రాంతంలో యువ ఇంజనీర్లు చేపట్టిన సర్వే కార్యక్రమం జోరందుకుంది. ఇంజనీరింగ్ అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి రహదారుల విస్తరణపై సర్వేలు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా ప్రవేశపెట్టిన రహదారుల విస్తరణలో భాగంగా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం పెందుర్తి నుంచి అరుకుకు సమీపంలోని అంతరాష్ట్రం ఒడిస్సా కూడలి వరకు రహదారి విస్తరణ జరుగుతున్న నేపధ్యంలో సమగ్ర సర్వే నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు పెందుర్తి నుంచి కొత్తవలస, శృంగవరపుకోట మీదుగా అనంతగిరి మండలం శివలింగపురం వరకు సర్వేలు జరిగాయి. మరో రెండు నెలల్లో సర్వేలు పూర్తి చేయాలని ప్రభుత్వ ఉన్నతాధికారులు గడువు విధించిన నేపధ్యంలో రహదారుల విస్తరణ సర్వేలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఉన్న రహదారి మధ్య నుంచి ఇరు వైపులా 25 అడుగుల మేరకు రహదారుల విస్తరణ జరుగుతుందని సర్వే బృందం తెలిపింది. రహదారుల విస్తరణతో రోడ్డు ప్రమాదాల నివారణ, సురక్షిత ప్రయాణం, ప్రయాణీకులకు భద్రత కలుగుతుందని వారు చెప్పారు. అయితే రహదారుల విస్తరణ పనులు ప్రారంభమైతే స్థానికులు, వ్యాపారులు పలు రకాలుగా నష్టాలను చవిచూడాల్సి వస్తుందని తెలుస్తోంది.

సీలేరులో ఛీప్ ఇంజనీర్ విస్తృత పర్యటన
సీలేరు, మార్చి 26: సీలేరు కాంప్లెక్స్‌లో జెన్‌కో ఛీప్ ఇంజనీర్ కేశవస్వామి శనివారం విస్తృతంగా పర్యటించారు. ఈసందర్భంగా మొదట సీలేరు జల విద్యుత్ కేంద్రానికి చేరుకుని విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు పనితీరుపై ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. జల విద్యుత్ కేంద్రంలో సాంకేతిక లోపాలు తలెత్తి విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడుతున్న నేపధ్యంలో బ్రేకర్‌లో లోపాలు రెండు రోజుల్లో సరి చేసి విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ఇన్‌చార్జ్ డి. ఇ. రామో