విశాఖపట్నం

బాక్సైట్‌పై స్థంభించిన పాలకవర్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, డిసెంబర్ 28: విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం ఇచ్చిన అన్ని రకాల అనుమతులను రద్దు చేయాలని కోరుతూ ఐ.టి.డి.ఎ. పాలకవర్గ సమావేశం తీర్మానం చేయాలని ప్రజాప్రతినిధులు పట్టుబట్టారు. బాక్సైట్ అంశంపై ప్రజాప్రతినిధుల నిరసనలతో పాలకవర్గ సమావేశం దాదాపు గంటన్నర సేపు స్థంభించిపోయింది. స్థానిక కుమ్మరిపుట్టు యువజన శిక్షణ కేంద్రంలో కలెక్టర్ యువరాజు అధ్యక్షతన సోమవారం నిర్వహించిన ఐ.టి.డి.ఎ. పాలకవర్గ సమావేశంలో బాక్సైట్‌పై వాడి వేడి చర్చసాగింది. పాడేరు, అరకులోయ శాసనసభ్యులు గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వరరావు సమావేశం ప్రారంభం కాగానే బాక్సైట్ అంశాన్ని చర్చకు తీసుకువచ్చి పాలకవర్గ సమావేశంలో తీర్మానానికి పట్టుబట్టారు. బాక్సైట్ అనుమతులను రద్దు చేయాలని కోరుతూ సమావేశంలో తీర్మానించి ప్రభుత్వానికి పంపించాలని, ఆతరువాతనే మిగిలిన అంశాలను చర్చించాలని వారు కోరారు. గతంలో నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో బాక్సైట్ అంశాన్ని ఏజెండాగా చేర్చాలని కోరినప్పటికీ ఈ సమావేశంలో కూడా దీనిని చేర్చకపోవడం బాధాకరమని వారు నిరసన వ్యక్తం చేసారు. గిరిజనుల అభివృద్ధి, వారి సంక్షేమం కోసమే ఐ.టి.డి.ఎ. పాలకవర్గ సమావేశం ముఖ్య ఉద్ధేశ్యమని, బాక్సైట్‌తో గిరిజనుల జీవితాలు నాశనవౌతుంటే ఈ అంశాన్ని ఏజెండా అంశంగా ఎందుకు పరిగణించకూడదని వారు ప్రశ్నించారు. బాక్సైట్ తవ్వకాలను చేపడితే వేలాది మంది గిరిజనుల ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నందున గిరిజనుల ప్రాణాల కంటే మరే అంశం కూడా తమకు ముఖ్యం కాదని వారు అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలకు ఆన్‌రాక్ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందాలకు సంబంధించిన జి.ఒ.నెం.222ను రద్దు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి శాసనసభలో ప్రకటించి చంద్రబాబు తవ్వకాలకు జారీ చేసిన జి.ఒ.నెం.97ను రద్దు చేయకపోవడం గిరిజనులను మరోసారి మోసం చేయడమేనని వారు విమర్శించారు. గిరిజన గ్రామాలకు రోడ్లు నిర్మించాలంటే అటవీ శాఖ అనుమతులు కావాలని రోడ్ల నిర్మాణాన్ని అర్థాంతరంగా నిలిపివేస్తుండగా ఎవరి అనుమతులతో బాక్సైట్ తవ్వకాలకు పూనుకుంటున్నారని వారు ప్రశ్నించారు. పాలకవర్గ సమావేశం ద్వారా గిరిజనులకు భరోసా కల్పించేందుకు జి.ఒ.నెం.97ను రద్దు చేయాలని కోరుతూ తీర్మానించాల్సిందేనని ఈశ్వరి, సర్వేశ్వరరావు డిమాండ్ చేసారు. దీంతో కలెక్టర్ జోక్యం చేసుకుని ఇదే అంశం గత రెండుసార్లు పాలకవర్గ సమావేశాలలో చర్చకు వచ్చినప్పుడు తాను చెప్పిన విషయాలను సభ్యులు పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ఐ.టి.డి.ఎ. పాలకవర్గంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సభ్యులుగా ఉన్నందున బాక్సైట్‌పై తీర్మానం చేసేందుకు అవకాశం లేదని ఆయన అన్నారు. బాక్సైట్‌పై సభ్యులకు ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా తనకు లిఖితపూర్వకంగా తెలియచేస్తే ప్రభుత్వానికి సిఫార్సు చేయగలనని, గత పాలకవర్గ సమావేశంలో సభ్యులు ఇచ్చిన లిఖితపూర్వక అభ్యంతరాలను ప్రభుత్వానికి నివేదించామని ఆయన పేర్కొన్నారు. కలెక్టర్ సమాధానంతో సంతృప్తి చెందని ఎం.ఎల్.ఎ. సర్వేశ్వరరావు మాట్లాడుతూ మన్యంలో బాక్సైట్ సంపద విలువ ఐదు లక్షల కోట్ల రూపాయలని చెబుతున్నారని, ఇందులో ప్రభుత్వానికి వచ్చేది స్వల్ప మొత్తమేనని అన్నారు. తవ్వకాలు చేపట్టే ప్రయివేట్ కంపెనీలన్నీ సంపదను దోచుకుపోతే స్థానికంగా ఉన్న గిరిజనులకు అన్యాయమే జరుగుతుందని ఆయన చెప్పారు. గిరిజనుల ప్రాణాలు ప్రభుత్వానికి ముఖ్యమా? లక్షల కోట్లు ముఖ్యమా? అంటూ ప్రశ్నించారు. సమావేశంలో పాల్గొన్న పెదబయలు ఎం.పి.పి. మహేశ్వరరావు మాట్లాడుతూ గత పాలకవర్గ సమావేశంలో సభ్యులు ఇచ్చిన లిఖిత పూర్వక అభ్యంతారాలను ప్రభుత్వానికి పంపిస్తే ఎటువంటి స్పందన వచ్చిందని ప్రశ్నించారు. పాడేరు, అరకులోయ, గూడెంకొత్తవీధి, చింతపల్లి, జెడ్పీటీసీ సభ్యులు పోలుపర్తి నూకరత్నం, నళిని, పద్మకుమారి, గూడెంకొత్తవీధి, డుంబ్రిగుడ ఎం.పి.పి.లు బాలరాజు, కుజ్జమ్మ తదితరులు మాట్లాడుతూ బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యమా? రౌడీ రాజ్యమా అంటూ ఆందోళన వ్యక్తం చేసారు. గిరిజనులకు ఏదీ చేసినా చేయకపోయినా బాక్సైట్ తవ్వకాల జి.ఒ.ను రద్దు చేయాల్సిందేనని అన్నారు. సమావేశంలో సభ్యులంతా బాక్సైట్ అనుమతుల రద్దుకు తీర్మానం కోసం పట్టుబట్టడంతో కలెక్టర్ మరోసారి జోక్యం చేసుకుని సభ్యులు ప్రస్తావించిన అన్ని అంశాలను నమోదు చేస్తున్నామని, వీటిని ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పారు. సభ్యులు ఎవరైనా లిఖితపూర్వకంగా అభ్యంతరాలను వ్యక్తం చేస్తే వీటిని కూడా ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. దీంతో బాక్సైట్ తవ్వకాల అనుమతులన్నీ రద్దు చేయాలని కోరుతూ పాడేరు, అరకులోయ శాసనసభ్యులు ఈశ్వరి, సర్వేశ్వరరావు కలెక్టర్‌కు వినతిపత్రం అందచేయడంతో వివాదం సద్దుమణిగింది.

ట్రైకార్ యూనిట్లు సంక్రాంతిలోగా ప్రారంభించాలి
* బ్యాంకర్లకు కలెక్టర్ యువరాజు ఆదేశం
పాడేరు, డిసెంబర్ 28: విశాఖ ఏజెన్సీలో గిరిజన నిరుద్యోగ యువతకు ట్రైకార్ పథకం కింద మంజూరు చేసిన యూనిట్లను సంక్రాంతిలోగా ప్రారంభించాలని కలెక్టర్ ఎన్.యువరాజు ఆదేశించారు. స్థానిక ఐ.టి.డి.ఎ. కార్యాలయంలో వివిధ బ్యాంకు శాఖల అధికారులతో సోమవారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ట్రైకార్ యూనిట్లు మంజూరు చేసిన లబ్ధిదారులకు సబ్సిడీ మంజూరు చేసేందుకు బ్యాంకులు చొరవ తీసుకోవాలని సూచించారు. లబ్ధిదారులకు, మహిళా సంఘాలకు పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చేసి మన్యం అభివృద్ధికి బ్యాంకర్లు సహకరించాలని ఆయన చెప్పారు. ట్రైకార్ రుణాలు శతశాతం అమలు చేయాల్సిన బాధ్యత బ్యాంకర్లు తీసుకోవాలని యువరాజు అన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి ఎం.హరినారాయణన్ మాట్లాడుతూ మన్యంలో ఎ.టి.ఎం.ల కొరత ఉండడంతో అరకులోయ, చింతపల్లి, కొయ్యూరు, అనంతగిరి మండలంలోని పర్యాటక కేంద్రమైన బొర్రా ప్రాంతాలలో అదనంగా ఎ.టి.ఎం.లు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. చింతపల్లి, గూడెంకొత్తవీధి, జి.మాడుగులలో బ్యాంకు శాఖలను ఏర్పాటు చేయాల్సి ఉందని ఆయన చెప్పారు. బ్యాంకులు, ఎ.టి.ఎం.ల ఏర్పాటుకు ముందుకు వచ్చే బ్యాంకు శాఖలకు వౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పలువురు అధికారులు, వివిధ బ్యాంకు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.