విజయవాడ

నవరత్నాలకు అనుగుణంగా గిరిజన సంక్షేమ శాఖ బడ్జెట్‌కు ప్రతిపాదనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 17: బడ్జెట్ కోసం తుది ప్రతిపాదనలు పంపే క్రమంలో గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ గంధం చంద్రుడు తలమునకలయ్యారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నవరత్నాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి హామీల మేరకు బడ్జెట్‌కు ప్రతిపాదనలు చేయనున్నారు. గిరిజన సంక్షేమ శాఖ చేపడుతున్న పథకాలను సమీక్షించి అవసరమైనచోట కొత్త పథకాలు చేర్చడంతో పాటు ఇప్పటికే అమలులో ఉన్న పథకాల్లో అవసరమైన మార్పులు చేస్తున్నారు. పథకాలకు కావాల్సిన అదనపు నిధుల కేటాయింపుల కోసం చర్యలు తీసుకుంటూ కొత్త బడ్జెట్ ప్రతిపాదనలను రూపొందిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ సందర్భంగా పంపిన రూ. 3,072 కోట్ల ప్రతిపాదనల్లో మార్పులు, చేర్పులు చేసి రూ. 3,476.95 కోట్లతో అంచనాలు ఆర్థిక శాఖకు పంపుతున్నారు. ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్లో గిరిజన సంక్షేమ శాఖకు జరిగిన కేటాయింపుల కంటే ఇది రూ. 1076.86 కోట్లు అధికం. అయితే పెంచిన ఈ అంచనాల్లో రూ. 746 కోట్లు 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వ్యయాల కోసం కాగా, మిగిలిన రూ. 330.86 కోట్లు వాస్తవిక పెంపు. బడ్జెట్ అంచనాల్లో అత్యధికంగా రూ. 616.95 కోట్లు విద్యకు కేటాయించారు. ఈ క్రమంలో నవరత్నాలకు అనుగుణంగా స్కాలర్‌షిప్‌లు, ఉచిత విద్యుత్, గిరిపుత్రికల పెళ్లి కానుక కార్యక్రమాలకు అధిక నిధులు కేటాయించనున్నారు. స్కాలర్‌షిప్‌లకు రూ. 152.44 కోట్లు ప్రతిపాదించారు. ఉచిత విద్యుత్ పథకానికి రూ. 139.04 కోట్లు ప్రతిపాదించగా ఇందులో రూ. 48.47 కోట్లు మెనిఫెస్టోలోని హామీల కోసం కేటాయించనున్నారు. మరో రూ. 12 కోట్లు 2018-19కి సంబంధించిన కట్టుబడి వ్యయం కాగా, రూ. 42.03 కోట్లు మార్చి 2018 వరకు చెల్లించాల్సిన బాకీల కోసం కేటాయించారు. గిరిపుత్రికల పెళ్లికానుక పథకానికి రూ. 39.04 కోట్లు ప్రతిపాదించగా మెనిఫెస్టోలో చెప్పిన విధంగా ఒక్కొక్కరికి రూ. లక్ష అందజేయడం కోసం అదనంగా రూ. 24.38 కోట్లు ప్రతిపాదించారు. ఫుడ్ బాస్కెట్ పథకానికి రూ. 314.90 కోట్లు, గిరిజన ఆర్థికాభివృద్ధి పథకాలకు రూ. 300 కోట్లుగా అంచనాలు పంపారు. మొత్తం 12 పథకాలకు 100 శాతం పైబడి పెంచిన ప్రతిపాదనలు చేశారు. ఇందులో నవరత్నాలకు రూ. 139.11 కోట్లు, ముఖ్యమంత్రి హామీలకు రూ. 103.34 కోట్లు ప్రతిపాదనలు పంపారు. మొత్తం 11 పథకాలకు 20 కోట్ల కంటే ఎక్కువగా అదనపు నిధుల విడుదలకు ప్రతిపాదనలు పంపారు.