విశాఖపట్నం

ఎమ్మెల్యే రోజాపై కక్ష సాధింపు తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: వైకాపా ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్‌పై హైకోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు వెలువడిన ఆమెను అసెంబ్లీలోకి అడుగుపెట్టనివ్వకుండా మార్షల్స్ అడ్డుకోవడం విచారకరమని వైకాపా నేత గొల్ల బాబురావు అన్నారు. శనివారం వైకాపా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోర్టు తెలిపిన విషయమై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని అసెంబ్లీ స్పీకర్ ముందుగా చెప్పి ఉంటే బాగుండేదన్నారు. అలాగాకుండా ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీ లోపలికి అడుగుపెట్టనివ్వకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పును అనుసరించకపోతే కోర్టు ధిక్కారమే అవుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వైకాపా నేతలపై నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న తమ పార్టీ నేత జగన్మోహన్‌రెడ్డి వైపే ప్రజలు ఉన్నారని, ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.