విశాఖపట్నం

చంద్రబాబుది రాక్షస పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలన తీరు రాక్షస పాలనను గుర్తు చేస్తుందని వైకాపా జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాద్ అన్నారు. వైకాపా ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీలోకి అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ శనివారం డాబాగార్డెన్స్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పీకర్ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు విన్పిస్తున్నాయన్నారు. స్పీకర్ అధికార పార్టీకి కొమ్ముకాసే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం సాగిస్తున్నారని చెప్పారు. జగన్ పట్ల ప్రజాదరణ చూసి ఓర్వలేక వైకాపాపై కక్ష సాధింపుచర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొల్ల బాబురావు, పార్టీ నాయకులు కోలా గురువులు, గొలగాని రాము, జాన్ వెస్లీ తదితరులు పాల్గొన్నారు.

బలమైన రాజ్యాంగంతోనే దేశ ప్రగతి

విశాఖపట్నం: భారతదేశం బలమైన రాజ్యాంగం కలిగి ఉండటం వల్లనే ప్రగతి సాధ్యపడిందని మాజీ విసి జిఎస్‌ఎన్ రాజు అన్నారు. శనివారం ఉదయం ఆయన ఎయు న్యాయకళాశాల, అంబేద్కర్ అధ్యయన కేంద్రం సంయుక్తంగా చేపట్టిన 1్ఛలెంజస్ టు ఇండియన్ కానిస్టిట్యూషన్ ఫండమెంటల్స్ అండ్ అంబేద్కరిజం2 అనే అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో సామాజిక, ఆర్థిక, విద్యా రంగాల్లో సమానత్వం సాధించాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా ప్రజల జీవన పరిస్థితులు మెరుగుపడగలవన్నారు. ఈ సదస్సులో పాల్గొన్న ఇన్‌ఛార్జి వైస్ ఛాన్సలర్ ఇఎ నారాయణ మాట్లాడుతూ ధృడమైన రాజ్యాంగానికి ఎలాంటి సవాళ్లు రావని అన్నారు. రాజ్యాంగంలో ప్రతి సమస్యకు ఒక పరిష్కార మార్గం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాలకమండలి సభ్యుడు ఎం.ప్రసాదరావు మాట్లాడుతూ అందరికీ సామాజిక న్యాయం అందించడమే పెద్ద సవాల్ అని చమత్కరించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఆర్ సుబ్బారావు, ప్రిన్సిపల్ ఎ.సుబ్రహ్మణ్యం, డైరెక్టర్ డి.సూర్యప్రకాశరావు, చాణక్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఎ.లక్ష్మినాద్ తదితరులు ప్రసంగించారు.