విశాఖపట్నం

నష్టాల ఊబిలో చేపల బోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: చేపలవేటకు వెళితే మత్స్యకారులకు పంట పండినట్టే. ఇది ఒకప్పటి మాట. అదే ప్రస్తుత పరిస్థితుల్లో వేటకు వెళితే వ్యయప్రయాసలే తప్ప. కష్టానికి తగినట్టుగా ఫలితమనేది ఏమాత్రం ఉండటంలేదు. జీవనం కోసం సాహసించి సముద్రంలోకి చేపలవేటకు వెళ్ళడమే మిగులుతోందంటూ మత్స్యకారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇటీవల నెలకొన్న పరిస్థితులు అనేక కారణాలతో చేపలవేట ఏమాత్రం కలసిరావడంలేదు. దీంతో మత్స్యకారుల జీవనస్థితిగతులు అత్యంత దయనీయంగా మారుతున్నాయి. సముద్రానే్న నమ్ముకుని బతికీడ్చే మత్స్యకార కుటుంబాలు ఇపుడు ఏమీ చేయాలో తెలియక ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాయి.
* అక్టోబర్ నుంచి లేని వేట
గత ఆరు మాసాలుగా చేపలవేట ఏమాత్రం ఆశాజనకంగా లేకపోవడంతో మత్స్యకార కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు. గత ఏడాది అక్టోబర్ నుంచి పరిస్థితులు ఏమాత్రం బాగోలేదంటూ చెబుతున్నారు. ఇటీవలకాలంలో బోట్లు సంఖ్య విపరీతంగా పెరిగింది. విజయనగరం జిల్లా బోగాపురం సమీపాన అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పడుతుందనే విస్తృత ప్రచారంతో సముద్రతీర ప్రాంతాల్లో నివశించే మత్స్యకారుల నుంచి ఎక్కడ వ్యతిరేకత వస్తుందనే కారణంతో భూముల్లేని వారికి సైతం లక్షలాది రూపాయలు ప్రభుత్వం తరపున ముట్టచెప్పారు. భూముల్లేని వారంతా ఆధార్‌తోనే సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విధంగా వచ్చిన సొమ్ముతో మత్స్యకారులు కొంతమంది బోట్ల కొనుగోలు చేయడం ద్వారా సముద్రంలోకి వేటకు వెళ్తున్నారు. రోజురోజుకీ పెరుగుతున్న బోట్లతో ఎవరికీ చేపలు లభించడంలేదు. అలాగే సముద్రతీర ప్రాంతాల్లో వెలుస్తోన్న అనేక రకాలైన పరిశ్రమలు వదులుతున్న రసాయనక పదార్ధాలతో మత్స్యసంపద నాశనమవుతోంది. అరుదైన, విలువైన చేపలు రసాయనాలకు బలవుతున్నాయి. రింగ్ వలలు కూడా చిన్నచిన్న చేప పిల్లలు చనిపోతున్నాయి. వీటి వినియోగంతో చేపల సంతతి వృద్ధి లేకుండాపోతోంది. స్పీడ్ ఇంజన్లు అందుబాటులోకి రావడంతో బోట్ల వేగం పెరగడం, ఎక్కువ చేపలు పడటంతో ఒకేసారి ఎక్కువ మొత్తంలో సేకరించడం జరిగిపోతోంది. అదే వేగాన్ని తగ్గించగలిగితే పది బస్తాలు పడే పరిస్థితులుంటాయి. వేగంతో నడిచే బోట్ల వలన ఒకేసారి దాదాపు వంద బస్తాల చేపలు పడే అవకాశాలున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. ఇటువంటి అనేక రకాలైన కారణాలతో చేపలవేట సరిగ్గా జరగడంలేదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
* పెండింగ్‌లో డీజిల్ సబ్సిడీ
డీజిల్ సబ్సిడీకి బ్రేక్ పడింది. ప్రభుత్వం నుంచి సబ్సిడీ నిధులు మంజూరుకాకపోవడంతో దీనివల్ల మత్స్యకారులు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులకు గురవుతున్నారు. లీటర్ డీజిల్‌కు రూ.6.03లను ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఈ విధంగా రూ.10.23కోట్ల మేర మత్స్యకారులు డీజిల్ సబ్సిడీ రూపంలో చెల్లించాల్సి ఉంది. కష్టాల్లో ఉన్న మత్స్యకారులను ఆదుకునేందుకు 11 మాసాలుగా పెండింగ్‌లో ఉన్న సబ్సిడీ మొత్తాన్ని మంజూరు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఆంధ్రప్రదేశ్ మెకనైజ్డ్ బోట్స్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పిసి అప్పారావు కోరారు. అనేక రకాలుగా మత్స్యకారులను ఆదుకుంటున్న తెలుగుదేశం ప్రభుత్వం దీనిని మంజూరు చేసి సహకరించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. గత ఏడాది అక్టోబర్ నుంచి చేపలవేట లేదని, జూన్ వరకు ఇదే పరిస్థితి అని ఆయన పేర్కొన్నారు. అనేక కారణాలతో చేపలవేట గణనీయంగా పడిపోయిందని, దీనినే నమ్ముకున్న మత్స్యకారుల జీవనస్థితిగతులు దయనీయంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.