విశాఖపట్నం

పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి నేడు రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: అఖిల భారత జాతీయ కాంగ్రెస్ కమిటీ (ఏఐసిసి) ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీ నుంచి వ చ్చేనెల ఐదవ తేదీ వరకు జరిగే సామాజిక న్యాయ సాధికారిక యాత్రలు విశాఖ నుంచి మొదలవుతాయి. వీటిని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రారంభిస్తారు. ఇందుకోసం ఆదివారం ఆయన ఇక్కడకు వస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆదివారం ఈ యాత్రలు ప్రారంభించి, బాబూజగజ్జీవన్‌రామ్ జయంతి వచ్చేనెల 5వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అన్ని జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణాల్లో సభలు, సమావశాలు జరుగుతాయి. జగజ్జీవన్‌రామ్ జయంతిని పురస్కరించుకుని వచ్చేనెల 5వ తేదీన కర్నూలు కేంద్రంలో భారీ బహిరంగసభ ఉంటుంది.

సిజిఆర్‌ఎఫ్ చైర్‌పర్సన్‌కు ధరఖాస్తులు ఆహ్వానం

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ గెజిట్ నెంబర్ 116, తేదీ 16.2.2016ని అనుసరించి ఈపిడిసిఎల్‌లో కన్స్జూమర్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ ఫోరం (సిజిఆర్‌ఎఫ్) చైర్‌పర్సన్, ఇండిపెండెంట్ మెంబర్ పోస్టులకు సంబంధించి నియామక ప్రకటన విడుదలైంది. దీనిని సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్/హెచ్‌ఆర్‌డి ఏవి సూర్యనారాయణరావుశనివారం ప్రకటనలో తెలియజేశారు. ఈ నెల 15, 16 తేదీల్లో వీటికి సంబంధించి నియామక ప్రకటన ఇచ్చామని ఆయన తెలిపారు. పూర్తి వివరాలు సంస్థ వెబ్‌సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపిఈస్ట్రన్‌పవర్.కామ్‌లో పొందుపర్చినట్టు ఆయన పేర్కొన్నారు. అర్హత కలిగిన అభ్యర్ధులు వచ్చేనెల 18వ తేదీలోపు సంస్థ కార్పొరేట్ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన విజ్ఞప్తి చేశారు.