విశాఖపట్నం

కార్మికుల జీతాలు చెల్లించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: జివిఎంసి కార్మికుల జీతాలను తక్షణమే చెల్లించాలని కోరుతూ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం కమిషనర్ ఛాంబర్ వద్ద ధర్నా నిర్వహించారు. పెద్దఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షుడు పి.వెంకటరెడ్డి మాట్లాడుతూ 205వ స్థానంలో ఉన్న విశాఖ నగరాన్ని ఐదవ స్థానంలోకి తీసుకువచ్చిన జివిఎంసి పారిశుద్ధ్య కార్మికులకు రెండు మాసాలుగాను, నైట్ పేకెజి కార్మికులకు మూడు మాసాలుగాను, భీమిలి పారిశుద్ధ్య కార్మికులు ఐదు మాసాలుగాను వేతనాలు చెల్లించలేదన్నారు. సొసైటీలు, గుర్తింపు యూనియన్ సొసైటీలను రద్దు పర్చాలని కోరుతూ ధర్నాకు దిగాల్సి వచ్చిందన్నారు. దీంతో స్పందించిన కమిషనర్ యూనియన్ ప్రతినిధులతో సమస్యలపై చర్చించారు. యూనియన్ నాయకులు జి.సుబ్బారావు, పి.వెంకటరెడ్డి, టి.నూకరాజులు కమిషనర్‌తో చర్చించిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీలోపు కార్మికుల వేతనాలు చెల్లింపుకు, సొసైటీలపై చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. దీంతో కార్మికులు శాంతించారు. చనిపోయిన వారి ఖాళీలను అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులు పనిచేస్తున్న వారిని మస్టర్లలో పెట్టాలని కోరగా త్వరలో నిర్ణయం తీసుకుంటామని కమీషనర్ తెలిపారు. 2014 డిసెంబర్ 23వ తేదీన అంగీకరించిన మినిట్స్‌ను అమలు చేయడం, 279 జీవోపైన కార్మికుల పనిభద్రత పైన అనుమానాలను నివృత్తి చేయడానికి తేదీని నిర్ణయించి చర్చిద్దామని కమిషనర్ జివిఎంసి ఎంప్లారుూస్ యూనియన్ (సిఐటియు) ప్రతినిధి బృందానికి తెలియజేశారు.
సర్కారు నిరంకుశత్వంపై వైసీపీ నిరసన
పాడేరు, మార్చి 19: న్యాయ వ్యవస్థను కించపరుస్తూ తెలుగుదేశం ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిరంకుశ వైఖరిని నిరసిస్తూ వైసీపీ నాయకులు శనివారం స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నగరి శాసనసభ్యురాలు ఆర్‌కె రోజాను శాసనసభ నుంచి సంవత్సరం పాటు సస్పెండ్ చేస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి ఆమెను శాసనసభ సమావేశాలలో పాల్గొనే అవకాశం కల్పించినా ప్రభుత్వం నిరంకుశంగా ప్రవర్తించడాన్ని నిరసిస్తూ వైసీపీ శ్రేణులు నల్లబ్యాడ్జీలను ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు వైసీపీ నాయకులు మాట్లాడుతూ చంద్రబాబునాయుడు ప్రభుత్వం అత్యంత పాశవికంగా పరిపాలన సాగిస్తోందని విమర్శించారు. చట్టాలను, న్యాయ స్థానాలను ధిక్కరించడం అప్రజాస్వామికమని వారు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటికైనా తన నిరంకుశత్వాన్ని వీడి కోర్టు ఆదేశాల మేరకు రోజాను శాసనసభకు అనుమతించాలని డిమాండ్ చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వారు వినతిపత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బూరెడ్డి నాగేశ్వరరావు, వెయ్యాకుల సత్యనారాయణ, రత్నాలమ్మ, తాజ్ పాల్గొన్నారు.