విశాఖపట్నం

ప్రత్యేక రైల్వేజోన్ వస్తుందట...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 22: విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ ఖచ్చితంగా వస్తుందంటూ ఇప్పటికీ రైల్వే చెబుతోంది. అయితే దీనికి మరో కొత్త మెలికి పెట్టింది. రైల్వేజోన్ రావాలంటే ఈస్ట్‌కోస్ట్‌రైల్వే, దక్షిణమధ్య రైల్వే జోన్లను విభజించాల్సి ఉందట. ఇది జరిగితే తప్ప జోన్ ఏర్పాటుకు మార్గం సుగమం కాదంటూ కొత్త వంత పాడుతోంది. మరెక్కడా లేని వౌలిక వసతులు ఒక్క విశాఖలోనే ఉన్నాయంటూ చెబుతూ వస్తోన్న రైల్వేబోర్డు ఇపుడు కొత్తగా జోన్ల విభజనపై పడింది. నిన్నమొన్నటి వరకు అధికారిక ప్రకటన చేస్తే సరిపోతోందని, రాయగడ కొత్త డివిజన్ చేస్తే వాల్తేరు డివిజన్‌తో గుంటూరు, విజయవాడలు కలిపి ఈ మూడు డివిజన్లతో విశాఖలో కొత్త రైల్వేజోన్ ఏర్పాటు చేసేందుకు అవకాశాలున్నాయంటూ కేంద్రరైల్వేశాఖామంత్రి సురేశ్‌ప్రభు నుంచి ప్రతిఒక్కరూ చెబుతూ వచ్చారు. డివిజన్ల సరిహద్దులు జరిగిపోతుందని, జోన్ల మధ్య సఖ్యత ఉందని, ఉద్యోగుల సర్దుబాటు సులభమేనని కూడా పేర్కొంది. అలాగే నిధులు పెద్దగా వెచ్చించాల్సి పని ఉండదని, ముఖ్యంగా అవసరమైనన్ని భూములు రైల్వేకు సొంతంగా ఒక్క విశాఖలోనే ఉన్నాయన్న వాదన రైల్వేబోర్డు నుంచే వచ్చింది. అన్నిరకాలుగా సిద్ధపడిన రైల్వేబోర్డు ఇటీవల జరిగిన రైల్వే బడ్జెట్ నుంచి తన వాదనను మార్చుకుంది. సమైక్యాంధ్రను విభజించిన తరువాత కేవలం 13 జిల్లాలతో కూడిన ఆంధ్ర రాష్ట్ర విభజన చట్టంలోను ప్రత్యేక రైల్వేజోన్ అంశం పొందపర్చబడింది. అలాగే ఇక్కడే రైల్వేజోన్‌ను ఏర్పాటు చేయలంటూ గత దశాబ్ధకాలంగా ప్రజాసంఘాలు వివిధ రూపాల్లో ఉద్యమిస్తూనే ఉన్నాయి.
* సాధనకమిటీపై నెపం...
ప్రత్యేకరైల్వేజోన్‌పై వేసిన సాధన కమిటీపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధన కమిటీని వేసామని, ఇది అనుకూలంగానే రైల్వేబోర్డుకు నివేదికను సమర్పించిందంటూ ఇక్కడి ప్రజాప్రతినిధులే అనేకసార్లు చెప్పుకొచ్చారు. వీరే ఇటీవలకాలంలో తమ మాట మార్చి జోన్ సాధ్యంకాదనేది కమిటీ పేర్కొన్నట్టు చెబుతున్నారు. ఇందులో ఏది వాస్తవామో అంటూ ప్రయాణికులు అయోమయంలో పడుతున్నారు. రోజుకోమాట చెబుతూ అసలు దీనిని ఏర్పాటు చేయకుండా మరోసారి ఉత్తరాంధ్ర ప్రజానీకాన్ని మోసగిస్తారేస్తామో అంటూ మరికొంతమంది ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
* జోన్ల గొడవ...
ఈస్ట్‌కోస్ట్‌రైల్వేజోన్ పరిధిలో వాల్తేరు, సంబల్‌పూర్, ఖుర్ధా డివిజన్లు ఉండగా, అదే దక్షిణమధ్య రైల్వేజోన్‌లోకి సికింద్రాబాద్, హైదరాబాద్, గుంతకల్, గుంటూరు, నాందేడ్ డివిజన్లు వస్తాయి. అయితే విశాఖ కేంద్రంగా వాల్తేరు, విజయవాడ, గుంతకల్, గుంటూరు డివిజన్లతో కలిపి ప్రత్యేక రైల్వేజోన్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు గత కొనే్నళ్ళుగా నలుగుతున్నాయి. ఇది రాష్ట్ర విభజన జరగక ముందు నుంచి ఉండగా, విభజన బిల్లులో కూడా దీనిని కేటాయిస్తామన్న అంశానికి ఇప్పటి వరకు ప్రాధాన్యతనిస్తూనే వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, విశాఖ ఎంపీ డాక్టర్ కంభంపాటి హరిబాబు, కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు అనేకసార్లు దీనిపై హామీలివ్వడం, కేంద్రంస్థాయిలో వత్తిడి తీసుకురావడం జరుగుతూనే ఉంది. అయితే ఇందులో పరస్పరం విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారు. జోన్ సాధ్యంకాదని సాధన కమిటీ నివేదికనిచ్చిందని ప్రజాప్రతినిధులు చెబుతుండటం, దీని గురించి ఇప్పటి వరకు కేంద్రం నోరుమెదపకపోవడం, రైల్వేవర్గాలు జోన్‌పట్ల విముఖత చూపుతుండటం, జోన్ల మధ్య సమన్వయలోపం వంటి అనేక కారణాలు దీనిపై స్పష్టతను తీసుకురాలేకపోతున్నాయి.
* స్పష్టత లేని ప్రకటనలు...
ఇటీవల విశాఖ ఎంపీ హరిబాబు సైతం దీనిపై సాంకేతికపరమైన సమస్యలున్నాయంటూ ప్రకటించగా, వైఎస్సార్‌కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులు ఇటీవల నిర్వహించిన నిరసన కార్యక్రమంలో సాక్షాత్తూ డివిజనల్ రైల్వేమేనేజర్ చంద్రలేఖముఖర్జీ మాట్లాడుతూ జోన్ ఏర్పాటుకు సాంకేతికపరమైన సమస్యలంటూ ఉండవని, రాజకీయ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందన్నారు. ఈ విధంగా పొంతన లేని ప్రకటనలు ఉత్తరాంధ్ర ప్రజానీకాన్ని అయోమయంలో పడేస్తున్నాయి. కాగా రాష్ట్రానికి న్యాయం చేయాలంటే రాజకీయపరమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను అమలు చేయడానికి కట్టుబడి ఉన్నామని చెబుతున్న కేంద్రం రైల్వేజోన్ అంశానికి సంబంధించి నిపుణుల కమిటి నివేదికపై నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంది. విశాఖ కేంద్రంగా జోన్ ఏర్పడితే తూర్పుకోస్తా పరిధిలో కేవలం రెండు డివిజన్లు మాత్రమే ఉంటాయి. అలాగే దక్షిణమధ్య రైల్వేజోన్‌లో మూడు డివిజన్లు మాత్రమే మిగులుతాయి. రెండు, మూడు డివిజన్లతో రైల్వేజోన్ సాధ్యంకాదు. ఇదే విషయాన్ని నిపుణుల కమిటీ బోర్డు తెలిపినట్టు తెలిసింది. భారతీయరైల్వే పరిధిలో ఉన్న 16 రైల్వేజోన్లపైన డివిజన్లు, జోన్ల విభజన ప్రభావం ఉంటుందనేది స్పష్టమవుతోంది. రాజకీయంగా గట్టి నిర్ణయం తీసుకోపోవడం, ఏకాభిప్రాయం లేని కారణాలు జోన్ ఏర్పాటుకు అనుకూలంగా లేకుండా పోతున్నాయి.