పశ్చిమగోదావరి

ఆరోగ్యశ్రీలో మరో 106 వ్యాధులకు చికిత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లిగూడెం, ఆగస్టు 21: కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రుల ద్వారా ఉచిత వైద్యసేవలు అందజేస్తున్నామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. రూరల్ మండలం పెదతాడేపల్లిలో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్యశిబిరం, అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి మాణిక్యాలరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ కొత్తగా 106 రకాల వ్యాధులను ఆరోగ్యశ్రీలో చేర్చామన్నారు. అతిత్వరలో 35 సంవత్సరాలు పైబడిన మహిళలకు సహజంగా వచ్చే క్యాన్సర్, ఇతర మొండి వ్యాధులకు సంబంధించిన అన్నిరకాల చెకప్‌లు రాష్ట్రంలో అన్ని ఆస్పత్రుల్లో అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. రాష్ట్రంలో 243 పట్టణ ఆరోగ్య కేంద్రాలకు 120 కేంద్రాల పనితీరు సంతృప్తికరంగా లేదని మంత్రి పేర్కొన్నారు. పనితీరు మెరుగుపరిచేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రుల్లో పనితీరు మారకుంటే అథికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఏరియా ఆస్పత్రిలో యాక్సిడెంట్ ట్రామాకేర్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని, డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయనున్నామన్నారు. దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం జనరిక్ మందులను సామాన్య ప్రజలకు అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ కె.శంకరరావు, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ యర్రా నవీన్, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ నిర్వాహకులు డాక్టర్ సుంకవల్లి చినబాబు, గ్రామ సర్పంచ్ కె.విజయ, ఉపసర్పంచ్ తులసీదాస్, అత్తింటి సుబ్బరాజు, చింతా సుధాకర్, పరిమి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.