పశ్చిమగోదావరి

సంచార దుకాణాలతో పెరిగిన జిసిసి ఉత్పత్తుల అమ్మకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుట్టాయగూడెం, ఆగస్టు 29: కల్తీలతో వినియోగదారుడు అన్నివిధాల నష్టపోతున్న ఈ రోజుల్లో మేలైన అటవీ ఉత్పత్తులతో తయారైన నాణ్యమైన వస్తువులను అందించి, తద్వారా సంస్థ ఆదాయాన్ని పెంచుకోవడానికి సంచార దుకాణాలు ఎంతో తోడ్పడుతున్నాయని కోటరామచంద్రపురం గిరిజన సహకార సంస్థ (జిసిసి) సీనియర్ మేనేజర్ జి.రామారావు తెలిపారు. కెఆర్ పురం జిసిసి కార్యాలయం వద్ద సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని తాడేపల్లిగూడెం, ఏలూరు, నల్లజర్ల, కొవ్వూరు, భీమవరం తదితర పట్టణాల్లో గిరిజన ఉత్పత్తులను సంచార దుకాణాల ద్వారా విక్రయిస్తునట్టు చెప్పారు. ఈ సంచార దుకాణాలకు ప్రజల నుండి మంచి స్పందన రావడంతో తాడేపల్లిగూడెంలో గిరిజన ఉత్పత్తుల శాశ్వత దుకాణాన్ని తెలిచినట్టు పేర్కొన్నారు. ఈ దుకాణాల ద్వారా అడవుల నుండి గిరిజనులు సేకరించిన ఉత్పత్తులను కొనుగోలు చేసి, వాటితో తయారుచేసిన నాణ్యమైన వస్తువులను మైదాన ప్రాంత ప్రజలకు అతి తక్కువ ధరలకు చేరుస్తున్నామన్నారు. తమ ఉత్పత్తుల్లో తేనె, సబ్బులు, బిల్వ షర్బత్, త్రిఫల జ్యూస్, సన్నారి, కుంకుడు, ఉసిరి, సీకాయ పొడులు ముఖ్యమైనవిగా వివరించారు. తమ సంస్థ సూపర్ బజార్, సంచార దుకాణాల ద్వారా ఈ ఏడాది కోటి రూపాయల వ్యాపారం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. 201516 రూ.7 కోట్ల లక్ష్యసాధనకు రూ. 7.5 కోట్లు సాధించి, 201617కు 13 కోట్ల రూపాయల లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు తెలిపారు. గత ఏడాది కంటే సుమారు నూరుశాతం లక్ష్యం పెరగడంతో మరిన్ని వ్యాపారావకాశాలను అనే్వషిస్తున్నట్టు చెప్పారు.
త్వరలో కన్నాపురం, జీలుగుమిల్లిలలో పెట్రోలు బంకుల ఏర్పాటుకు చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. 2006 నుండి ఇప్పటివరకు 58 మంది రైతులు రూ.5.58 కోట్లు రుణాలు బకాయి పడ్డారని, వీరికి రైతు రుణమాఫీ కింద రుణాల రద్దుకు అర్హత ఉన్నందున మాఫీకి అవసరమైన చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. త్వరలోనే ఈ రైతుల రుణాలు మాఫీ కాగలవన్నారు.
తమ పరిధిలోని మూడు ఏజన్సీ మండలాల్లో 32 డిఆర్ డిపోలు, 10 సబ్ డిపోలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వీటిలో పనిచేసేందుకు కొత్తగా 18 మందిని కమీషన్ డీలర్లుగా తీసుకున్నామని, వీరిలో ఆరుగురు బాధ్యతలు తీసుకోగా, 12 మంది రావలసి ఉన్నట్లు తెలిపారు. రేషన్‌కార్డులు విభజన పూర్తవగానే కమీషన్ డీలర్ల దుకాణాలు ప్రారంభమవుతాయన్నారు.