పశ్చిమగోదావరి

మళ్లీ మారిన మార్గదర్శకాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఆగస్టు 29: కొత్త ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు గడిచిపోతున్నా కూడా పాత ఇళ్లకు మరమ్మతులు చేయించటం మినహా కొత్తగా ఒక ఇల్లు కట్టామని చెప్పుకునే పరిస్థితి లేకుండా పోయింది. టిడిపి ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం అవశేష ఆంధ్రప్రదేశ్‌లో కొలువుదీరిన దగ్గరనుంచి ఇంతకుముందు ఉన్న ఇందిరమ్మ గృహాల స్ధానంలో ఎన్టీఆర్ గృహాల నిర్మాణ పథకం రంగప్రవేశం చేసింది. మొత్తం రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో రెండు లక్షల గృహాలను నిర్మిస్తామని ప్రకటన కూడా చేసింది. అయితే రెండున్నరేళ్లు గడిచిపోయినా గృహనిర్మాణానికి ఒక అడుగు కూడా ముందుకు పడలేదంటే ఆశ్చర్యం కాదు. ఈలోగా విడతలవారీగా మార్గదర్శకాల్లో మార్పులు చేస్తూ, యూనిట్ వ్యయాలను భారీగా తగ్గిస్తూ ఇతరత్రా అంశాల్లో మార్పులు తీసుకువస్తూ ఎప్పటికప్పుడు కేబినేట్ భేటీలు, ఆ తర్వాత ఉత్తర్వుల జాతర సాగుతోంది. తాజాగా మరోదశ మార్గదర్శకాలు కూడా విడుదలయ్యాయి. ఇంతకీ ఈస్థాయిలో కుస్తీ ఎందుకని చూస్తే తొలిదశలో అప్పటి అధికారులు యూనిట్ వ్యయాన్ని భారీగా నిర్ణయించి ప్రకటించేయటంతో జనంలో కూడా ఆశలు వెల్లివిరిశాయి. కానీ వెంటనే ప్రభుత్వాధినేతలు దానిపై నీళ్లు జల్లేశారు. అధికారిక సమావేశాల్లో యూనిట్ ఖర్చు ఈస్థాయిలో ఉంటే అనుకున్న సంఖ్యలో గృహాలను ఎలా నిర్మిస్తామని ఆందోళన చెందారు. దీంతో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పధకం సందిగ్ధంలో ఉండిపోయింది. ఆ తర్వాత మరింత కసరత్తు చేసి యూనిట్ వ్యయం కొంత తగ్గించి, సరికొత్తగా మార్గదర్శకాలు వచ్చాయి. గత ఏప్రిల్ 14వ తేదీన అన్ని జిల్లాల్లో అట్టహాసంగా ఎన్టీఆర్ గృహనిర్మాణానికి శంకుస్ధాపన చేసి, పైలాన్‌లు ఆవిష్కరించారు. మళ్లీ వ్యవహారంలో కదలిక లేకుండా పోయింది. చివరకు మళ్లీ మార్గదర్శకాలు సవరించి తాజాగా మరోసారి విడుదల చేశారు. ఈ మొత్తంలో జరిగింది ఏమిటని చూస్తే లబ్ధిదారుల సంఖ్య పెరగడానికి, పదిమందికి సాయం అందించడానికి ఇంత కసరత్తు జరిగిందా అంటే అదీలేదు. వెనుక ఉన్న కథ తెలుసుకుంటే ఆశ్చర్యం కలగకమానదు. ఈమొత్తం గృహనిర్మాణ పథకాలకు కేంద్రం అమలుచేస్తున్న ఐఎవై కీలకంగా నిలుస్తోంది. దీనిద్వారా వచ్చే రూ.1.25 లక్షల ఆధారంగానే ఈపథకాలన్నీ రూపకల్పన జరిగాయి. అయితే చివరిదశలో కేంద్రం రాష్ట్రాల్లో చోటుచేసుకుంటున్న ఈపరిస్థితులను గమనించి చిన్న మెలిక పెట్టింది. గతంలో మాదిరిగా ఇష్టానుసారం కాకుండా స్పష్టంగా దారిద్య్రరేఖకు దిగువనున్న వారికి మాత్రమే ఐఎవై మంజూరవుతుందని స్పష్టంచేసింది. అంతేకాకుండా 13 అంశాలను స్పష్టంచేసి వాటి విషయంలో సంతృప్తి చెందిన తర్వాతే మాత్రమే లబ్ధిదారులను గుర్తించటం, వారికి రావాల్సిన నిధులను మంజూరు చేయటం జరుగుతుందని మరింత స్పష్టంగా చెప్పేసింది. ఆ 13 అంశాలను చూస్తే లబ్ధిదారులు లభించే అవకాశం లేనేలేదని చెప్పవచ్చు. ద్విచక్రవాహనం ఉన్నా, టివి ఉన్నా ఇలాంటి షరతులు అన్నీ దానినిండా ఉన్నాయి. అలాంటప్పుడు రాష్ట్రప్రభుత్వం తలపోసిన రీతిలో ఐఎవైని జోడించి ఎన్టీఆర్ పథకాన్ని ముందుకు తీసుకువెళ్లటం అతికష్టంగా మారిపోయింది. ఈపరిస్థితుల్లో ఐఎవైని అలాఉంచుతూ తాజాగా ఉపాధి హామీ పధకాన్ని కూడా జోడించి రాష్ట్రప్రభుత్వంపై మరికొంత భారాన్ని తగ్గించుకుని యూనిట్ వ్యయాన్ని కూడా కుదిస్తూ వరుస మార్గదర్శకాలను విడుదల చేస్తూ వచ్చారు. ఈవిధంగా ఇప్పటికి మూడుసార్లు ఇవి మారగా ఇంకెన్నిసార్లు మారతాయో, ఎప్పటికీ ఎన్టీఆర్ గృహనికి పునాదులు వేస్తారోనన్న అందోళన అందరిలోనూ నెలకొంది. మొదట రూ.15వేల మరుగుదొడ్డితో కలిపి యూనిట్ విలువను రూ.2.9 లక్షలుగా నిర్ణయించారు. అనంతరం ఈ మొత్తాన్ని రూ.2.25 లక్షలకు కుదించారు. తాజాగా కేవలం రూ.1.50 లక్షలకు కుదించారు. ఈ కుదింపు ఇంకెంత కిందకు వెళుతుందోనన్న అనుమానాలు లేకపోలేదు. మొత్తంమీద ఏం జరిగినా, ఏ పథకం ముందుకెళ్లినా కేంద్రం సహాయం లేకుండా కనీసం స్పష్టమైన మార్గదర్శకాలు కూడా విడుదలయ్యే పరిస్థితి లేనట్టు కన్పిస్తోంది. ఈ హౌసింగ్ సీరియల్‌కు ముగింపు ఎపిసోడ్ ఎప్పుడు పడుతుందో వేచి చూడాల్సిందే.