పశ్చిమగోదావరి

కాపుమేళాలో రుణాలు వెంటనే మంజూరు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, సెప్టెంబర్ 1:ప్రతి మండలంలో, నియోజకవర్గంలో కాపుమేళా ఏర్పాటుచేసి లబ్దిదారులకు వెంటనే రుణాలు అందించి పధకాలను గ్రౌండింగ్ చేసేవిధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ అధికారులను ఆదేశించారు. స్ధానిక కలెక్టరేట్‌లో గురువారం లబ్దిదారులకు ఏమేరకు రుణాలు అందించింది, కార్పోరేషన్ల ద్వారా సబ్సిడీల మంజూరు తదితర అంశాలపై సమన్వయాధికారులతో ఆయన సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ స్ధానిక ఎమ్మెల్యేలను సంప్రదించి రుణమేళా తేదీలను నిర్ణయించాల్సిందిగా జెసి-2 ఎంఎ షరీఫ్‌ను ఆదేశించారు. కాపు కార్పోరేషన్ ద్వారా 11వేల మంది లబ్దిదారులకు రుణాలు ఇవ్వాల్సి ఉండగా కేవలం రెండువేలమందే యూనిట్లు గ్రౌండింగ్ చేసుకుంటే మిగిలిన యూనిట్లు ఎప్పుడు గ్రౌండింగ్ చేస్తారని ప్రశ్నించారు. 2015-16 ఆర్ధిక సంవత్సరానికి గాను బిసి కార్పోరేషన్ ద్వారా 3100 ఖాతాదారులకు 14కోట్ల రూపాయల సబ్సిడీ పడాల్సి ఉందని, వెంటనే బిసి కార్పోరేషన్ ఇడి పెంటోజీరావు హైదరాబాద్ వెళ్లి ఈ మొత్తం లబ్దిదారుల ఖాతాల్లో పడేలా చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. యూనిట్ గ్రౌండింగ్ చేయకుండా యుటిలైజేషన్ సర్ట్ఫికెట్ సమర్పించి బ్యాంకుల ద్వారా రుణం పొందినవారిపై కఠినమైన చర్యలు ఉంటాయని కలెక్టరు హెచ్చరించారు. ఎస్సీ కార్పోరేషన్‌కు సంబంధించి 129మంది లబ్దిదారులకు మూడురోజుల్లో సబ్సిడీ మొత్తం వారి ఖాతాల్లో పడేలా చూడాలని ఆదేశించారు. ప్రధానమంత్రి ముద్ర యోజనాపధకం ద్వారా చేపల ఎగుమతులను పెద్దఎత్తున మన రాష్ట్రంలో చేపట్టాలని నిర్ణయించామని, దీనికిగాను మత్స్యశాఖ, జాతీయ చేపల అభివృద్ధి, మ్యాప్‌కాన్స్ సంయుక్తంగా ఒక ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. దీనిలో 9పధకాల ద్వారా మత్స్యకారులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ఈ పథకం ద్వారా రుణం దేశంలోని అన్ని ఆర్ధికసంస్ధల నుండి పొందవచ్చునన్నారు. శిశు పధకం కింద 50 వేల రూపాయల రుణం, కిషోర్ పధకం కింద 50 నుండి అయిదు లక్షల రూపాయల వరకు, తరుణ్ పధకం కింద అయిదు నుండి 10 లక్షల రూపాయల వరకు రుణం పొందవచ్చునన్నారు. సమావేశంలో జెసి-2 షరీఫ్, మత్స్యశాఖ ఉపసంచాలకులు రామకృష్ణంరాజు, ఎల్‌డిఎం సుబ్రహ్మణ్యేశ్వరరావు, నాబార్డు డిడి కె రామప్రభు, బిసి కార్పోరేషన్ ఇడి పెంటోజీరావు, వివిధ శాఖల సమన్వయాధికారులు పాల్గొన్నారు.