పశ్చిమగోదావరి

ఫార్మాలో మార్పులొస్తున్నాయ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, సెప్టెంబర్ 1: ఫార్మాలో మార్పులొస్తున్నాయ్. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని మార్పులకు శ్రీకారం చుడుతున్నాం. రోగులను కూడా దృష్టిలో ఉంచుకుని మరిన్ని పరిశోధనలు చేస్తున్నాం. మైక్రోక్యాప్సిల్‌కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నామని ఇథియోపియా దేశం మెకలే విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ సుభాష్‌చంద్ర దిండా పేర్కొన్నారు. విష్ణు విద్యాసంస్థల ఆవరణలోని విష్ణు ఫార్మశీ కళాశాలలో 5వ ఇండో- ఆఫ్రికన్ అంతర్జాతీయ సదస్సు విష్ణు విద్యాసంస్థలు, అసోసియేషన్ ఆఫ్ ఫార్మశీ ప్రొఫెషనల్స్ సంయుక్తంగా భీమవరంలో గురువారం నుండి ప్రారంభమైంది. రీసెంట్ ట్రెండ్స్ అండ్ ఫ్యూచర్ డెవలప్‌మెంట్ ఇన్ ఫార్మాస్యూటికల్ సెక్టార్ అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిధిగా ప్రొఫెసర్ సుభాష్‌చంద్ర దిండా విచ్చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. ప్రసాద్ అధ్యక్షత వహించారు. మరో అతిధిగా పుల్లారెడ్డి, కళాశాల ఫార్మశీ విభాగాధిపతి ప్రొఫెసర్ పికె లక్ష్మి, అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ప్రసాదరాజు పాల్గొని ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా ఫార్మశీ రంగంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయన్నారు. భారత్‌తో పాటు ప్రపంచంలోని అనేక దేశాలు ఫార్మశీలో కీలకమైన పరిశోధనలు చేస్తున్నాయన్నారు. ఈ పరిశోధనల ద్వారా ఎన్నో ఫలితాలను కూడా రాబడుతున్నామని దిండా తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా రోగుల సంఖ్య కూడా ఎక్కువ పెరగడంతో వారికి కావాల్సిన రీతిలో మందులు తయారుచేస్తున్నామన్నారు. ఫార్మశీ కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు చదువు పూర్తిచేసుకుని పరిశోధనల వైపు రావాలని పిలుపునిచ్చారు. అలాగే క్యాన్సర్ సంబంధిత వ్యాధులపై కూడా ఫార్మశీ విద్యార్థులు దృష్టిసారించి, వ్యాధి నివారణకు మందు కనుగొనాలని కోరారు. అసోసియేషన్ ఆఫ్ ఫార్మశీ ప్రొఫెషనల్స్ రాష్ట్ర కన్వీనర్, అధ్యక్షుడు డాక్టర్ సురేష్ చెన్నుపాటి, విష్ణు ఫార్మశీ కళాశాల డైరెక్టర్ డాక్టర్ డి. బసవరాజు తదితరులు పాల్గొన్నారు. సదస్సుకు హాజరైన విద్యార్థులకు ప్రతిభ పత్రాలను ప్రదానం చేశారు.