పశ్చిమగోదావరి

బాబోయ్... అన్నీ అబద్ధాలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, సెప్టెంబర్ 22: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నోరు తెరిస్తే అన్ని అబద్ధాలేనని, అంతా మోసమేనని వైకాపా అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు జనం ఓట్ల కోసం ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయినా ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసగించారన్నారు. చివరకు బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేసుకుని అ అవకాశం కల్పించే ప్రత్యేక హోదా విషయంలోనూ యువతరాన్ని మోసగించారని జగన్ నిప్పులు కక్కారు. అవిధంగా అటు ఎన్నికల హామీలను తుంగలోతొక్కి, ఇటు భవిష్యత్‌ను తీర్చిదిద్దే హోదాను కూడా మాయమాటలతో మభ్యపెడుతూ రాష్ట్రానికే చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తున్నారని ధ్వజమెత్తారు. ఇదే సమయంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుపై కూడా ఆయన పలువిమర్శలు చేశారు. స్ధానిక శ్రీ కనె్వన్షన్ హాలులో గురువారం వైకాపా ఆధ్వర్యంలో యువభేరి కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఇటీవల కాశ్మీర్‌లో మృతిచెందిన సైనికుల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ రెండునిముషాలు వౌనం పాటించారు. అతర్వాత జగన్ మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి జరిగిన పరిణామాలను, ముఖ్యమంత్రి, కేంద్రమంత్రులు మాటమార్చిన వైనాన్ని సుదీర్ఘంగా వివరించారు. ప్రధానంగా చంద్రబాబు అన్న మాట ఎప్పుడూ నిలబెట్టుకోలేదని, ఎన్నికల్లో హామీ ఇచ్చిన రైతు, డ్వాక్రా మహిళల రుణమాఫీలను ఇంతవరకు చేయలేదని, మిగిలిన హామీల పరిస్దితి కూడా అలాగే ఉందని ధ్వజమెత్తారు. చివరకు రాష్ట్రానికి విభజన సమయంలో ఇచ్చిన హామీ అయిన ప్రత్యేక హోదా విషయంలోనూ కేంద్రంతో మిలాఖత్ అయి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్రం హోదా ఇచ్చినా, ఇవ్వకపోయినా బిజెపి కాళ్లు మాత్రం వదలనంటూ బాబు భీష్మించుకుని కూర్చున్నారని, ఇంత దిగజారాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. తెలంగాణాలో జరిగిన ఓటుకు కోట్లు కేసు ఫలితంగా చంద్రబాబు రాష్ట్రాన్ని అమ్మేసే పరిస్దితికి చేరుకున్నారన్నారు. ఈ కేసులో ముఖ్యమంత్రి హోదాలో అడ్డగోలుగా దొరికిపోయిన చంద్రబాబును కనీసం అరెస్టు కూడా చేయలేదంటే అలాంటి ముఖ్యమంత్రి ఈయనొక్కరేనని జగన్ ఎద్దేవా చేశారు. అన్ని వ్యవస్ధలను మేనేజ్ చేస్తూ రాష్ట్రానికి వెన్నుపోటు పొడుస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి హోదా ఇచ్చేది లేదని, ప్యాకేజీతో సరిపెట్టుకోవాలని కేంద్ర ఆర్దిక మంత్రి అరుణ్‌జైట్లీ విలేఖరుల సమావేశం పెట్టి ప్రకటిస్తే మరీ ఆ ఇంగ్లీషు ఏం అర్ధమైందోగాని వెంటనే చంద్రబాబు విలేఖరుల సమావేశం పెట్టి హోదా ఇవ్వకపోవడాన్ని, ప్యాకేజీతో సరిపెట్టడాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రకటించారన్నారు. అంతేకాకుండా ప్రధానికి ఫోన్ చేసి థాంక్యూ చెప్పారని పేర్కొన్నారు. హోదా ఏమైనా నీ అత్త సొత్తా, నీ అబ్బ సొత్తా అంటూ ప్రశ్నిస్తూ ప్రజలు ఎవరూ అంగీకరించకపోయినా చంద్రబాబు మాత్రం కేంద్ర ప్యాకేజీకి స్వాగతం పలకటం దారుణమన్నారు. అంతేకాకుండా ఎన్నికల ముందు హోదా సంజీవనంటూ ప్రకటించిన చంద్రబాబు ఇప్పుడు ఆ హోదా వల్ల అంత ప్రయోజనాలు లేవంటూ మాట్లాడటం దారుణమన్నారు. పట్టపగలు అబద్ధాలు అడుతూ రాష్ట్ర ప్రజలను మోసగిస్తున్న ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగటం మంచిది కాదని పేర్కొన్నారు. విభజన సమయంలో ప్రత్యేక హోదా అయిదేళ్లు ఇస్తామంటే కాదు పదేళ్లు అంటూ అప్పట్లో రాజ్యసభలో ప్రతిపక్షంలో ఉన్న వెంకయ్యనాయుడు పట్టుపట్టారన్నారు. అయితే ఎన్నికల సమయంలో కూడా నరేంద్రమోదితో రాష్ట్రానికి హోదా ఇప్పిస్తామని హామీలు ఇప్పించి చివరకు ఇప్పుడు హోదా సాధ్యం కాదంటూ అప్పట్లో ఏదో వేడిలో అన్నానంటూ వెంకయ్య వ్యాఖ్యానించటం ప్రజలను మోసగించటం కాదా అంటూ ప్రశ్నించారు. విభజన జరిగిన సమయంలోనే అప్పటి యుపిఎ కేబినెట్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నిర్ణయం తీసుకుని చర్యలు తీసుకోవాలని ప్రణాళికా సంఘానికి పంపిందన్నారు. అతర్వాత తొమ్మిదినెలలపాటు ఈసంఘం కొనసాగినా రాష్ట్రానికి హోదా విషయంలో ఎటువంటి చర్యలు లేకుండా పోయాయన్నారు. ఇప్పుడు మాత్రం ఆ సంఘం లేదు, నీతిఅయోగ్ వచ్చిందంటూ ప్రచారం చేస్తూ హోదా ఇచ్చే అవకాశాలు లేవని చెపుతున్నారన్నారు. వాస్తవానికి 14వ ఆర్దిక సంఘం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వవద్దని ఎక్కడా చెప్పలేదని అంటూ దానికి సంబంధించిన కొన్ని పత్రాలను చదివి విన్పించారు. అయినప్పటికీ దానిని అడ్డం పెట్టుకుని హోదాకు మోకాలడ్డుతున్నారని చెప్పారు. ఇక హోదా ఉన్న ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఏం అభివృద్ధి సాధించాయని ఇప్పుడు చంద్రబాబు ప్రశ్నించటం దుర్మార్గమన్నారు. ఆ రాష్ట్రాల్లో హోదా వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి, నెలకొల్పిన పరిశ్రమలు, పెరిగిన ఉద్యోగ అవకాశాలను చూస్తే ఎన్ని అవకాశాలు ఉంటాయో అర్ధమవుతుందన్నారు. ఇలాంటి వివరాలన్ని ఇంటర్‌నెట్‌లో అందుబాటులో ఉంటాయని దీనిపై తమ పార్టీ కరపత్రాన్ని కూడా ప్రచురించిందని, ఎవరైనా ఈ గణాంకాలను పరిశీలించుకోవచ్చునన్నారు. హోదా వల్ల అదాయపుపన్నుతోపాటు వివిధ రకాల పన్నుల వసూళ్లపై ఎంతో వెసులుబాటు వస్తుందని, ఇలాంటి అవకాశాన్ని ఏ పారిశ్రామికవేత్త వదులుకోరని, ఫలితంగా రాష్ట్రం అభివృద్ధి చెంది యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. హోదా సాధించేవరకు తమ పోరాటం కొనసాగుతుందని, దీనికి యువతరం సహకరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో వైకాపా జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలు కారుమూరి నాగేశ్వరరావు, తెల్లం బాలరాజు, గ్రంధి శ్రీనివాస్, పుప్పాల వాసుబాబు, పాతపాటి సర్రాజు, కొఠారు రామచంద్రరావు, కొయ్యే మోషేన్‌రాజు, కొట్టు సత్యనారాయణ, చెల్లెం అనంద్‌ప్రకాష్, తానేటి వనిత, ఘంటా మురళీ, వివిధ వర్గాలకు చెందిన బివి కృష్ణారెడ్డి, డాక్టరు కృష్ణ్భగవాన్, సాంబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భారీ ర్యాలీ
హైదరాబాద్ నుండి గురువారం ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న వైఎస్ జగన్ అక్కడ నుంచి భారీ ర్యాలీగా ఏలూరు చేరుకున్నారు. దారిపొడవునా ఆయనకు ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభించింది. వైకాపా జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని స్ధానిక వట్లూరు గేటువద్ద ఆయనకు ఘనస్వాగతం పలికారు.