పశ్చిమగోదావరి

తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తణుకు, సెప్టెంబర్ 22: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ స్థానిక ప్రభుత్వాసుపత్రిని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా వివిధ విభాగాలకు చెందిన వార్డులను సందర్శించి రోగులను కలిసి, అందుతున్న సేవలపై ఆరాతీశారు. అలాగే పారిశుద్ధ్యం అమలును కూడా ఆయన పరిశీలించారు. అనంతరం మంత్రి విలేఖర్లతో మాట్లాడుతూ తణుకు ప్రభుత్వాసుపత్రి నిర్వహణ తీరు తనను సంతృప్తిపరిచిందని చెప్పారు. రోగులకు వైద్యసేవలందించడంలోను, పర్యావరణ పరిరక్షణకు చేస్తున్న కృషి తనను సంతృప్తిపరిచిందని మంత్రి కితాబునిచ్చారు. ఇదే పద్ధతిలో అన్ని ఆసుపత్రులను నిర్వహించేందుకు తగిన ఆదేశాలు జారీచేశామని డాక్టర్ కామినేని తెలిపారు. పేదప్రజల కోసం నెలకొల్పిన ప్రభుత్వాసుపత్రుల్లో అన్నిరకాల వైద్య సదుపాయాలను ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రభుత్వాసుపత్రి అభివృద్ధికి అవసరమైన నిధులను కేటాయించాలని కోరుతూ డాక్టర్ కామినేనికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ, అభివృద్ధి కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.