పశ్చిమగోదావరి

దుర్గంధం... దుర్భరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాళ్లపూడి, సెప్టెంబర్ 22: తాళ్లపూడిలో చుట్టూ పచ్చని నాచుతో దుర్గంధం వెదజల్లే నీటి మధ్య దాదాపు 40 యానాది కుటుంబాలు గత 20 రోజులుగా జీవనం సాగిస్తున్నారు. దూరం నుండి చూస్తే తాళ్లపూడి యానాది కాలనీ పచ్చని దీవిలో ఉన్నట్టు కన్పిస్తుంది. గ్రామంలో యానాది కాలనీకి ఎగువన ఉన్న పాకలవీధి, బిసిల వీధి నుండి వచ్చే మురుగునీటితో యానాది కాలనీ సమీపంలో గల చెరువు నిండిపోయింది. బయటకు వెళ్లే మార్గం లేక ఆ నీరంతా యానాది కాలనీలో ప్రవేశించింది. గత కొన్ని రోజులుగా దుర్గంధం వెదజల్లే చెరువుతో, దోమలు, పందుల బెడదతో నిత్యం పోరాడుతున్నామని ఆ కుటుంబాలు వాపోతున్నారు. కొవ్వూరు ఎమ్మెల్యే కెఎస్ జవహర్ గతంలో జరిపిన పాదయాత్ర సమయంలో కరెంటు కనెక్షన్లు ఇప్పించారని, ఇటీవల తాళ్లపూడి ఎంపిడిఒ మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టారన్నారు. అయితే ఎగువ నుండి వచ్చే మురుగునీరు పోయే పరిస్థితులు కల్పించాలని వారు కోరుతున్నారు. బయట నుండి వచ్చిన నీటితో పాటు వర్షం నీరు కూడా బయటకు పోయే మార్గంలేదన్నారు.