పశ్చిమగోదావరి

మరిన్ని ఉచిత డయాలసిస్ సెంటర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లిగూడెం, సెప్టెంబర్ 22: రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న డయాలసిస్ సెంటర్లకు అదనంగా మరికొన్ని ఉచిత డయాలసిస్ సెంటర్లు ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ అన్నారు. గురువారం ఏరియా ఆస్పత్రిలో రూ.2కోట్లతో ఏర్పాటుచేసిన ఉచిత డయాలసిస్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రధాన కేంద్రాల్లో ఇప్పటికే ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్లకు అదనంగా మరో 13 సెంటర్లు ప్రారంభిస్తున్నామన్నారు. ఈ డయాలసిస్ కేంద్రానికి రెసిడెంట్ జనరల్ ఫిజిషియన్‌గా సీనియర్ ఎండిని నియమిస్తామన్నారు. ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో నూతన సంస్కరణలు తీసుకువచ్చామన్నారు. పారా మెడికల్ సిబ్బందికి ట్యాబ్‌లు అందించి గర్భిణీల వివరాలు, సమాచారం సేకరించామన్నారు. గర్భిణీలకు వైద్యసేవలు అందించడంతోపాటు ప్రభుత్వ ఆస్పత్రిలో పురుడు పోసుకున్న వారికి గ్రామీణ ప్రాంతాల వారికి రూ. 1000, పట్టణ ప్రాంతాల వారికి రూ.600లు నగదు ప్రోత్సాహంతోపాటు జనన ధ్రువీకరణ పత్రం, బిడ్డకు టీకాలు వేసి ఎన్టీఆర్ కిట్‌లు అందిస్తామన్నారు.
రాష్ట్రంలో 35 ఏళ్లు దాటిన మహిళలకు ఉచిత మాస్టర్ హెల్త్ చెకప్ తీసుకువస్తున్నట్లు మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, కీళ్లనొప్పులు, షుగర్ వ్యాధి తదితర 10 వ్యాధులకు సంబంధించి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తారన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రాల ద్వారా మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. నెల రోజుల్లో 222 పట్టణ ఆరోగ్య కేంద్రాలను స్వచ్ఛందంగా నిర్వహించేవారికి అప్పగిస్తామన్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలో 3 ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో 1400 మంది వైద్యులను నియమిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టిన బిడ్డలకు ఎన్టీఆర్ కిట్ పేరుతో దోమతెర, శానిటేషన్ టవల్, సబ్బు తదితర వస్తువులు పంపిణీ చేస్తున్నామన్నారు. దోమల వల్ల కలిగే 5 ప్రాణాంతక వ్యాధులు దూరం చేసేందుకు ప్రభుత్వం కార్యాక్రమాలు చేపట్టిందన్నారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్, స్వచ్ఛ్భారత్‌లో భాగంగా ఈ నెల 24న సామూహిక ప్రజాచైతన్య యాత్ర నిర్వహిస్తామన్నారు. దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మాట్లాడుతూ రానున్న రోజుల్లో ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు. రాష్టవ్య్రాప్తంగా 2 వేల జనరిక్ మందుల షాపులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తల్లీబిడ్డ సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని చెప్పారు. గూడెంలో ప్రత్యేక ట్రామాకేర్ ఐసియు యూనిట్‌ను ఏర్పాటుచేయాలని కోరారు. రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేయాలన్నారు. ముదునూరు పిహెచ్‌సికి నూతన భవనం మంజూరు చేయాలన్నారు. ఎంపి గోకరాజు గంగరాజు, జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, మున్సిపల్ ఛైర్మన్ బి శ్రీనివాస్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్ గట్టిం మాణిక్యాలరావు, డిసిహెచ్‌ఎస్ డాక్టర్ కె శంకరరావు, మాజీ ఎమ్మెల్యే పసల కనకసుందరరావు, ఎమ్మెల్సీ రాము సూర్యారావు, కౌన్సిలర్ నేదూరి గంగాధరరావు తదితరులు పాల్గొన్నారు.