పశ్చిమగోదావరి

కథలకు కాలంచెల్లింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, సెప్టెంబర్ 22: టెక్నాలజీ సహకారంతో తన కంప్యూటర్ డాష్‌బోర్డులో అన్నీ చూస్తా... ఏ అధికారి ఎక్కడ ఉన్నారో క్షణాల్లో తెలిసిపోతుంది... నిర్దేశించిన పనిచేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ హెచ్చరించారు. స్ధానిక కలెక్టరేట్ నుండి గురువారం జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు, గ్రామ, మండలస్దాయి ప్రత్యేకాధికారులతో ఆయన సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పల్లెప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా పెద్దఎత్తున ముందుజాగ్రత్త చర్యలతోపాటు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు ఈనెల 26వ తేదీ వరకు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. జిల్లాలో 570 మంది పంచాయితీకార్యదర్శులలో కేవలం 84మంది మాత్రమే గురువారం ఉదయం 5గంటలకు అయా పంచాయితీలలో పనులు చేపట్టారని తన కంప్యూటర్ డాష్‌బోర్డులో రికార్డు అయిందని చెప్పారు. బయోమెట్రిక్ విధానం అమలులోకి రావటంతో ఏలూరులో ఉంటూ భీమవరంలో విధులు నిర్వర్తిస్తున్నానని కథలు చెప్పే రోజులకు కాలం చెల్లిందని, పంచాయతీ కార్యదర్శులతోపాటు జిల్లా అధికారులు కూడా పనిచేసే చోటే ప్రజలకు అందుబాటులో ఉండకపోతే శాఖాపరంగా చర్యలు తీవ్రంగా ఉంటాయని కలెక్టరు హెచ్చరించారు. గ్రామపంచాయతీల్లో వౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత, జిల్లాలో గ్రామీణ రహదారులను సిమెంటురోడ్లుగా మారుస్తున్నామని, వీధిలైట్ల కరెంటు బిల్లుల భారం పంచాయితీలపై తగ్గించాలనే ఉద్దేశ్యంతో ఎల్‌ఇడి బల్బులను ఏర్పాటుచేస్తున్నామని, కష్టపడి పనిచేస్తే మరింత ప్రగతి సాధించగలుగుతామన్నారు. జిల్లాలో వైద్యాధికారులు నిర్దేశించిన ప్రాంతాలలో పర్యటించి ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించి జిల్లాలో ఎక్కడా కూడా అంటువ్యాధులతో, జ్వరాలతో ప్రజలు బాధపడకుండా శ్రద్దవహించాలన్నారు.