పశ్చిమగోదావరి

నేను ముఖ్యమంత్రి అయతే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, సెప్టెంబర్ 22: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం స్ధానిక శ్రీ కనె్వన్షన్ సెంటరులో నిర్వహించిన యువభేరి కార్యక్రమంలో విద్యార్ధినీవిద్యార్ధులతో జగన్ ముఖాముఖి ఆసక్తికరంగా సాగింది. ఒక విద్యార్ధిని ఫీజు రీఎంబర్స్‌మెంట్ విధానాన్ని ప్రస్తావించి ఇప్పుడు ఎదురవుతున్న ఇబ్బందులను వివరించి మీరు సిఎం అయితే... యువతరానికి ఏం చేస్తారంటూ ప్రశ్నించింది. జగన్ సిఎం అయితే... అన్న మాట వినగానే సభాప్రాంగణం అంతా ఈలలు, చప్పట్లతో దద్దరిల్లిపోయింది. జగన్ కూడా చిరునవ్వులు చిందిస్తూ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈపధకాన్ని ప్రవేశపెట్టారని, దీనివల్ల పేదవిద్యార్ధినీవిద్యార్ధులు చదవడానికి భయపడే పరిస్దితి లేకుండా పోయిందన్నారు. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా విద్యకు పుల్‌స్ట్ఫా పెట్టే పరిస్దితి తప్పిపోయిందన్నారు. అయితే ఆతర్వాత వచ్చిన పాలకులు మాత్రం దీనిపై శీతకన్ను వేశారని, ఇప్పుడు చంద్రబాబు హయాంలో పధకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. అయితే తాను సిఎం అయితే ఈపరిస్థితి పూర్తిగా చక్కదిద్ది చదువు విషయంలో రాష్ట్రంలోని ఏ విద్యార్ధి ఆర్ధికంగా ఇబ్బందిపడకుండా నూరుశాతం ఫీజు రీఎంబర్స్‌మెంట్ పధకాన్ని అమలుచేస్తానని చెప్పారు. అంతేకాకుండా మెస్, ఇతర ఖర్చులను కూడా ఈపథకంలోనే భరిస్తామని చెప్పారు. అదేవిధంగా ఆతర్వాత అనూహ్యమైన వ్యాఖ్య కూడా చేశారు. ఒకవేళ తనకు ఏదైనా అయినా వైఎస్‌తోపాటు తన ఫోటో కూడా ప్రతి కుటుంబంలో ఉండేవిధంగా కార్యక్రమాలను అమలుచేస్తానని ప్రకటించారు. దీంతో సభాప్రాంగణం చప్పట్లతో నిండిపోయింది. మరో విద్యార్ధి అనిల్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన పార్టీలు ఎన్నో హామీలు ఇచ్చాయని, అయితే వాటిని అమలుచేయటం లేదని ఈవిధంగా చేసే పార్టీలను శిక్షించే చట్టం రావాలని అభిప్రాయపడ్డారు. దీనికి జగన్ స్పందిస్తూ హామీలను అమలుచేయని పార్టీలను ప్రజలే బంగాళాఖాతంలో కలిపేస్తారన్నారు. అయినా విద్యార్ధి చెప్పిన విధంగా చట్టం రావాల్సిన అవసరం ఉందని కూడా పేర్కొన్నారు. బేబి అనే మరో విద్యార్ధిని మాట్లాడుతూ దేశంలో ఇంత ప్రతిభ ఉండగా విదేశాల్లోనూ ఎన్నో నిర్మాణాలు చేస్తున్న ఇంజనీర్లు ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు సింగపూర్ మంత్రం జపిస్తుంటారని ప్రశ్నించారు. దీనిపై జగన్ మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని ప్రతిభ దేశంలో ఉందని, రాష్ట్రంలోనూ ఎన్నో అద్భుతాలు సృష్టించిన ఇంజనీర్లు ఉన్నారని, అయినప్పటికీ చంద్రబాబు సింగ్‌పూర్ జపం పఠించటం వెనుక అర్ధం అందరికి తెల్సిందేనని ఛలోక్తి విసిరారు. అశోక్ అనే విద్యార్ధి మాట్లాడుతూ ప్రజలకు వరుస హామీలు ఇచ్చి వాటిని నిలబెట్టుకోకుండా ఉండే నేతలను ఏం చేయాలంటూ ప్రశ్నించారు. దీనికి జగన్ మాట్లాడుతూ ఒకరకంగా ఇది అదృష్టమేనని, ఇలాంటి నాయకులు స్వాతంత్య్రానికి పూర్వం ఉండిఉంటే ఆ స్వాతంత్య్రం కూడా మనకి దక్కి ఉండేది కాదని వ్యాఖ్యానించారు. మరో విద్యార్ధి ప్రశ్నకు సమాధానం చెపుతూ జగన్ కొంత భిన్నంగానే మాట్లాడారు. చంద్రబాబు అయిదుకోట్ల మంది ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని, ఇలాంటి నాయకులకు దేవుడు మొట్టికాయ వేయటం ఖాయమని పేర్కొన్నారు. ఆద్యంతం ఈ కార్యక్రమం ఉల్లాసభరితమైన వాతావరణంలోను, యువతరం కేరింతల మధ్య, ఈలలు, చప్పట్ల మధ్య ఉత్సాహంగా సాగింది. చంద్రబాబుపై విమర్శలు గుప్పించినప్పుడల్లా యువత చప్పట్లతో మద్దతు తెలిపింది. కొన్నిప్రాంతాల్లో అధికారపక్షం నేతలు అడ్డంకులు సృష్టించేందుకు యత్నించినా పెద్దసంఖ్యలో యువతరం, ప్రజలు కూడా యువభేరికి హాజరయ్యారు.