పశ్చిమగోదావరి

‘ఓపెన్’ దందా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, సెప్టెంబర్ 25 : చిన్నప్పుడు చదువుకున్న బేతాళ కధలా ఈ వ్యవహారం కూడా మారిపోయింది. ఎప్పటికప్పుడు జరుగుతున్న తంతు అంతా తప్పుదోవ పడుతూనే వున్నా దానిపై విమర్శలు చెలరేగుతూనే వున్నా ఉన్నతాధికారుల దృష్టి మాత్రం ఈ వ్యవహారంపై లేకుండా పోతుంది. చివరకు ఇది ఒక బహిరంగ రహస్యంలా, ఓపెన్ దందాగా మారిపోయిందనే చెప్పవచ్చు. ఈ ఉపోద్ఘాతమంతా ఓపెన్ స్కూల్స్ పరీక్షల గురించే. వాస్తవానికి పాఠశాలల్లో సాధారణ విద్యను అభ్యసించే వారు పదేళ్లపాటు చదివితే పదవ తరగతి పరీక్షలురాయడానికి అర్హులవుతారు. అలాగే మరో రెండేళ్లు చదివితే ఇంటర్మీడియట్ పరీక్షలకు అర్హులవుతారు. కానీ ఓపెన్ స్కూల్స్ మాత్రం ప్రత్యేక సందర్భాల్లో పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రాసేందుకు ఉపయోగకరంగా వుండేందుకు ప్రభుత్వం నిర్ధేశించింది. దీనితో అధిక శాతం మంది పరీక్షలురాసే వారు పదవ తరగతి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ధృవపత్రాలు అత్యవసరంగా కావాల్సిన వారే అయి వుంటారు. ప్రభుత్వ లక్ష్యం ఎన్ని మంచి ఉద్దేశాలతో కూడి వున్నా అది చివరకు ఆచరణలోకి వచ్చే సరికి కొంతమంది దళారులకు భోజ్యంగా మారుతుండటం గతం నుంచి అనుభవమే. ఈసారి కూడా అలాంటి పరిస్థితే మరికొద్దిరోజుల్లో దర్శనం కానుంది. నెలాఖరులో ఓపెన్ స్కూల్స్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏలూరు, తణుకులలోని పరీక్షా కేంద్రాల్లో వందల మంది ఈ పరీక్షలు రాయనున్నారు. అయితే ఇంతకుముందు జరిగిన విధంగానే ఈసారి కూడా కొంతమందికి కాసులను మిగిల్చే రీతిలో ఈ తంతు ముందుకు సాగుతుందనే అనుమానాలు స్పష్టంగా వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఈ పరీక్షలు రాసే వారిలో అత్యధిక శాతం మంది ఉద్యోగస్తులే అయి వుంటారు. ప్రభుత్వ ఉద్యోగాల్లోచేరి పదోన్నతుల సందర్భంలోనూ ఉద్యోగాల క్రమబద్దీకరణ సమయంలోనూ ఈ పదవ తరగతి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ధృవపత్రాలు అత్యవసరమవుతుంటాయి. అలాంటి వారే ఓపెన్ స్కూల్స్ విధానాలకు ఎక్కువగా మొగ్గుచూపడం సాధారణం. ఇలా అత్యవసరం అవడమే కొంత మందికి ప్రధాన ఆదాయ వనరుగా మారిపోతుందన్న విమర్శలున్నాయి. దీనికి దరఖాస్తులు చేసిన దగ్గర నుంచి ఈ దందా మొదలవుతుందని చెబుతుంటారు. పరీక్షలు సునాయాసంగా పూర్తి చేయించి పరీక్షలు పాసయ్యేలా చూసేందుకు ముందుగానే ఇంత మొత్తం చెల్లిస్తే సరిపోతుందని కొంతమంది దళారులు వ్యవహారాన్ని నడిపిస్తుంటారు. ఆ విధంగా అభ్యర్ధులు కూడా ఈ ధృవపత్రాలు అత్యవసరం కావడం, వయస్సులు మీరిపోయి విద్యాభ్యాసానికి తక్కువ అవకాశాలున్న పరిస్థితుల్లో ఇలాంటి దళారుల మాటలకు లొంగిపోవడం సహజంగా జరుగుతుంటుంది. అలా ఈ వ్యవహారాన్ని ఒక కొలిక్కి తీసుకువచ్చి దరఖాస్తుచేసిన వారిలో ధృవపత్రాలు అత్యవసరమని భావిస్తున్న వారి నుంచి నిర్ధేశిత మొత్తాన్ని వసూలుచేస్తుంటారు. ఈ మొత్తంతో అసలు వ్యవహారం నడిపించి పరీక్షలు జరిగే సమయాల్లో అభ్యర్ధులకు పరీక్ష పత్రంలోని ప్రశ్నలకు తగిన సమాధానాలను అందించే వరకు ఈ ప్రక్రియ సాగుతుంది. ఆ తరువాత ఉన్న ప్రజలకు సమాధానాలు రాయడంతో సహజంగానే ఆ అభ్యర్ధులు ఉత్తీర్ణులవుతారు. మొత్తం మీద అభ్యర్ధులు కోరుకున్నది వారికి దక్కడంతోపాటు దళారులకు కావాల్సినంత కాసుల గలగల వినిపిస్తూనే వుంటుంది. ఇంతకుముందు జరిగిన పరీక్షల్లో అధిక శాతం ఈ విధంగా సాగినవేనన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తూనే వచ్చాయి. ఈసారి కూడా అలాంటి వ్యవహారమే ముందుకు సాగిందని, సప్లిమెంటరీ కావడంతో మరింత కీలకంగా మారిందన్న విమర్శలున్నాయి. అయితే ఈ విమర్శల నేపధ్యంలో ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై దృష్టి పెట్టి ఓపెన్ స్కూల్స్ విధానాన్ని క్రమబద్దీకరించినప్పుడే ఈ విధానం వల్ల కొంతైనా ఫలితం వుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.