పశ్చిమగోదావరి

వ్యాపార రంగంలో నూతన ఒరవడులు సృష్టించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, సెప్టెంబర్ 25: ఇంజనీరింగ్ విద్యార్థులు సృజనాత్మకతను మరింత మెరుగుపెట్టి వ్యాపార రంగంలో నూతన ఒరవడులు సృష్టించాలని దక్షిణ భారతదేశ థర్మాక్స్ సంస్థ బిజినెస్ మేనేజర్ సామిల్ షా పిలుపునిచ్చారు. భీమవరం విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీలోని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో రెండురోజులుగా ఉత్సాహవంతంగా జరుగుతున్న జాతీయస్థాయి విష్ణు ఇ-మోటో ఛాంపియన్‌షిప్-2016 (ఇ-బైక్ రేసింగ్) పోటీలు ఆదివారం మూడవ రోజుకు చేరుకున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 25 విద్యార్థి బృందాలు ఇ-బైక్ నమూనాలను వివిధ పరీక్షల్లో ప్రదర్శించి తుది మెరుగులు దిద్దుతున్నారు. టెక్నికల్, బరువు, వాన పరీక్షల అనంతరం ఇ-బైక్ నమూనాలు నవీన ఆవిష్కరణ పరీక్ష, త్వరణ పరీక్ష (యాక్సిలరేషన్), రోడ్‌క్రాస్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలను థర్మాక్స్ సంస్థ బిజినెస్ మేనేజర్ సామిల్ షా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటోమొబైల్ ఇంజినీరింగ్ ఆలోచనలతో ఇ-బైక్‌లను రూపొందించి ప్రదర్శించడం చాలా ఆనందంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో వ్యాపార రంగంలో ఆకర్షణీయమైన బిజినెస్ ప్లాన్‌తో ముందుకు వచ్చి ప్రజలకు ఈ వాహనాలు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం జరిగిన యాక్సిలరేషన్, రోడ్‌క్రాస్ పరీక్షల్లో వాహన చోదకులు అద్భుతమైన ప్రతిభ కనబర్చారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి. శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి. శ్రీనివాసరాజు, సమన్వయకర్తలు మనోనీత్‌కుమార్, వికాస్, సాగర్‌లు పోటీలను పర్యవేక్షించారు.