పశ్చిమగోదావరి

ప్యాకేజీ స్పష్టం చేస్తేనే ఆర్‌అండ్‌ఆర్ సర్వే జరగనిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేలేరుపాడు, సెప్టెంబర్ 25: వేలేరుపాడు మండలంలో అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రభుత్వం చేపట్టనున్న ఆర్‌అండ్‌ఆర్ సర్వేను ప్యాకేజీ స్పష్టం చేస్తేనే జరగనిస్తామని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వేర్వేరుగా ఏర్పాటుచేసిన వివిధ సమావేశాల్లో ఆయా పార్టీల నాయకులు మాట్లాడుతూ వేలేరుపాడు మండలానికి 2007లోనే పోలవరం భూసేకరణ చేపట్టి కేవలం ఎకరానికి లక్షా 15 వేల రూపాయలే ఇచ్చి, అందులోనే బ్యాంకు రుణాలు జమ చేసుకుని తీరని నష్టం చేశారని, ప్రస్తుతం ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలో సైతం పాత చట్టంతోనే అందించాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నదని అన్నారు. ఈ విషయాల్లో నూతన చట్టం ప్రకారం నష్టపరిహారం స్పష్టం చేస్తేనే సర్వే జరగనిస్తామని, లేకుంటే సర్వే జరగనిచ్చే ప్రసక్తేలేదని తెలుగుదేశం పార్టీతో సహా అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. ఈ సందర్భంగా ఆదివారం తహసీల్దార్ అన్ని రాజకీయ పార్టీలతోను సర్వే జరగనివ్వండి.. తదుపరి ప్రభుత్వం మీకు నష్టం లేకుండా సమృద్ధికరమైన ప్యాకేజీ అందించే ఉద్దేశంతో ఉందని పేర్కొన్నారు. అయినప్పటికీ టిడిపి మండల శాఖ అధ్యక్షుడు చీమల వెంకటేశ్వర్లు ఈ విధంగా గత పాలకులు సైతం నమ్మించి మోసం చేశారని, మరలా మోసపోయేందుకు తాము సిద్ధంగా లేమని అన్నారు. ముందుగా ప్యాకేజీ స్పష్టంచేస్తేనే సర్వే జరగనిస్తామని తహసీల్దార్ సమావేశాన్ని వాకౌట్ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం నాయకులు శేషమూరి సంజీవులు, మాచర్ల వెంకటేశ్వర్లు, ఉలపర్ల రాములు, యాళ్ల శంకరం, దుర్గారావు, ఎస్ సాయిబాబు, నండూరి వెంకటేశ్వర్లు, శివరామకృష్ణ, పుల్లారావు, గణేశుల ఆదినారాయణ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఎంపిపి గద్దే బౌతికకాయానికి అంత్యక్రియలు
గోపాలపురం, సెప్టెంబర్ 25: గోపాలపురం ఎంపిపి గద్దే వెంకటేశ్వరరావు అంతిమయాత్రను ఆదివారం నిర్వహించారు. వివిధ పార్టీల ప్రముఖులు, ఆయన శ్రేయోభిలాషులు, స్నేహితులు, బంధువుల మధ్య అంతిమ వీడ్కోలు యాత్ర ప్రారంభమైంది. ఆయన స్వగ్రామమైన చిట్యాలలో వెంకటేశ్వరరావు పార్థివ దేహాన్ని బాణాసంచా కాల్పులతో ఊరేగించారు. అక్కడి నుంచి ఊరేగింపుగా గోపాలపురం మండల పరిషత్ కార్యాలయానికి తీసుకువచ్చి ప్రజాసందర్శనార్థం సుమారు మూడు గంటలసేపు ఉంచారు. అనంతరం శాంతి రథంపై దేవరపల్లి మీదుగా రాజమహేంద్రవరానికి తరలించారు. వెంకటేశ్వరరావు రక్తసంబంధీకులు విదేశాల్లో ఉండటంతో వారు రావడానికి రెండురోజుల సమయం పడుతుందని, అప్పటివరకు రాజమహేంద్రవరంలో వెంకటేశ్వరరావు పార్ధీవదేహాన్ని భద్రంగా ఉంచి, అనంతరం దహన సంస్కారాలు చేపట్టనున్నట్టు కుటుంబీకులు తెలిపారు. ఆయన పార్ధీవదేహాన్ని గోపాలపురం, పోలవరం ఎమ్మెల్యేలు ముప్పిడి వెంకటేశ్వరరావు, ఎం శ్రీనివాసరావు, ఎఎంసి ఛైర్మన్‌లు ముళ్లపూడి వెంకట్రావు, పారేపల్లి రామారావు, పార్డ్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు బేతాళ వీరాస్వామి, వివిధ పార్టీలకు చెందిన నాయకులు వెలగా శ్రీరామ్మూర్తి, కొండేపాటి రత్నాజీ చౌదరి, కె రాము, జడ్పీటీసీ ఈలి మోహినీపద్మజారాణి, ఎంపిడిఒ కెఆర్‌ఎస్ కృష్ణప్రసాద్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు తదితరులు సందర్శించి నివాళులర్పించారు.

ఆంధ్రభూమి బ్యూరో