పశ్చిమగోదావరి

చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు రూ.5 కోట్లు రుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, సెప్టెంబర్ 25 : రాష్ట్రంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే బ్రాహ్మణులకు అయిదు కోట్ల రూపాయల వరకూ రుణాలు అందించడానికి చర్యలు తీసుకుంటామని ఇందుకు బ్యాంకర్లు కూడా సహకరించాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ ఛైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు కోరారు. స్థానిక కలెక్టరేట్‌లో ఆదివారం జిల్లాస్థాయి బ్యాంకర్లతో ఆయన బ్రాహ్మణులకు రుణాలందించే విషయంపై సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ నుండి 3103మంది పేదలకు ఈ ఆర్ధిక సంవత్సరంలో రుణలందించాలని లక్ష్యంగా నిర్ణయించామని పశ్చిమగోదావరి జిల్లాలో 360 మందికి రుణ సౌకర్యం కల్పించడంలో బ్యాంకులు సహకరించాలని ఆయన కోరారు. చాణక్య పధకం కింద చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే బ్రాహ్మణులకు రుణ సౌకర్యం అందించడంలో బ్యాంకర్లు సహకరించాలని కోరారు. చిన్న తరహా పరిశ్రమలకు పది లక్షల రూపాయల నుండి కోటి రూపాయల లోపు ప్రాజెక్టు కాస్ట్‌తో ముందుకు వచ్చే బ్రాహ్మణులు పది శాతం సొమ్ము భరించాలని 20 శాతం లేదా గరిష్టంగా పది లక్షల రూపాయల వరకూ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని మిగిలిన సొమ్మును బ్యాంకర్లు రుణంగా లబ్ధిదారులకు అందించాలని ఆయన కోరారు. కోటి రూపాయల నుండి అయిదు కోట్ల రూపాయల వరకూ మధ్య తరహా పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వచ్చే బ్రాహ్మణులకు గరిష్టంగా 25 లక్షల రూపాయలు సబ్జిడీగా అందిస్తామని పది శాతం లబ్ధిదారుడు భరిస్తే మిగిలిన ధనాన్ని బ్యాంకర్లు రుణ రూపంలో అందించాలని ఆయన కోరారు. జిల్లాలో స్వయం ఉపాధి పధకం క్రింద అంత్యోదయ అభివృద్ధి వంటి పధకాలను పేద బ్రాహ్మణులకు అమలుచేస్తున్నామని ఇందులో సబ్సిడీపోను మిగిలిన సొమ్మును బ్యాంకర్లు రుణంగా అందించి పేద బ్రాహ్మణుల ఆర్ధిక స్థితిగతులను మెరుగుపరచాలని కోరారు. సబ్సిడీ కోసం వచ్చే లబ్దిదారులను పట్టించుకోవద్దని, ఖచ్చితంగా యూనిట్ స్థాపించి ఆర్ధిక ప్రగతి సాధించే దిశగా కష్టపడి ముందుకు వచ్చే లబ్ధిదారులను బ్యాంకర్లు ప్రోత్సహించాలని కోరారు. పశ్చిమగోదావరి జిల్లాలో బ్యాంకర్లు పేద బ్రాహ్మణులకోసం రుణ సౌకర్యం కల్పించడంలో మరింత చొరవ చూపించాలని తీసుకున్న రుణాన్ని సద్వినియోగం చేసుకుని తిరిగి బ్యాంకులకు ఆ రుణం తీర్చే బ్రాహ్మణులకు ప్రోత్సాహకంగా భవిష్యత్తులో రెట్టింపు రుణ సౌకర్యం కల్పించేందుకు బ్యాంకర్లు సహకరించాలని కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో పేద బ్రాహ్మణుల స్థితిగతులు మెరుగుపరచడానికి ఇప్పటికే జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని ఆయన చెప్పారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లాలో పేద బ్రాహ్మణుల ఆర్ధిక పురోభివృద్ధికి సబ్సిడీతో కూడిన రుణాల కల్పనకు అత్యంత ప్రాధాన్యతిచ్చామని అక్టోబరు 7వ తేదీన ఏలూరులో, 14న భీమవరంలో, 18న తాడేపల్లిగూడెంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా వచ్చే దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారులకు రుణాలు అందించేందుకు తగు ప్రతిపాదనలను ఖరారు చేస్తామని ఆయన చెప్పారు. లబ్ధిదారులు యూనిట్లు స్థాపించేందుకు బ్యాంకర్లు కూడా స్వీయ పరిశీలన చేయాలని అప్పుడే లబ్ధిదారుల్లో కూడా ఒక క్రమశిక్షణ అలవడుతుందన్నారు. సమావేశంలో ఎల్‌డి ఎం సుబ్రహ్మణ్యేశ్వరరావు, డ్వామా పిడి వెంకటరమణ, డి ఆర్‌డి ఏ పిడి కె శ్రీనివాసులు, వివిద బ్యాంకులకు చెందిన ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.