పశ్చిమగోదావరి

మాదేపల్లిలో ప్రబలిన డెంగ్యూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, సెప్టెంబర్ 25 : ఏలూరు మండలం మాదేపల్లి గ్రామంలో 40 సంవత్సరాల వయస్సు కలిగిన మహిళకు డెంగూ వ్యాధి వచ్చినట్లు గుర్తించి ఆమెను వైద్య ఆరోగ్య శాఖ వారు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం ఆదివారం తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం కాదని వైద్యాధికారులు పేర్కొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె కోటేశ్వరి హుటాహుటిన మాదేపల్లి గ్రామంలో పర్యటించి నివాసాలకు వెళ్లి పరిస్థితులను సమగ్రంగా సమీక్షించారు. డి ఎంహెచ్ ఓ దగ్గరే వుండి గ్రామంలో రోడ్ల ప్రక్కన బ్లీచింగ్ చల్లించడం, దోమలు ప్రబలకుండా ఫాగింగ్ చేయించడం నిర్వహించారు. పలు ప్రాంతాల్లో మినీ సమావేశాలు ఏర్పాటుచేసి ఆమె మాట్లాడుతూ ప్రతీ కుటుంబం కూడా అప్రమత్తంగా వుండాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కాచి చల్లార్చిన నీటినే తాగాలని, ఇళ్ల ఆవరణలో వాడిన కొబ్బరిబొండాలు, గాజుపెంకులు, కూల్‌డ్రింక్ బాటిళ్లు ఉంచరాదని, వెంటనే వాటిని తొలగించాలని, వాటి ద్వారానే దోమలు ప్రబలుతాయని పేర్కొన్నారు. క్లోరినేషన్ చేసిన మంచినీటిని సేవించాలని, ఆహార పదార్ధాలపై మూతలు ఏర్పాటుచేసుకోవాలని, నిల్వ వుంచిన ఆహార పదార్ధాలను తినకూడదని, భోజనానికి ముందు, మల విసర్జన అనంతరం చేతులను సబ్బుతో శుభ్రపర్చుకోవాలన్నారు. చెత్తకుప్పలు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు. పలు గ్రృహాలకు వెళ్లి డి ఎంహెచ్ ఓ ఆరోగ్య సూత్రాలను వివరించారు. ఈ సందర్భంగా కలిసిన విలేఖరులతో డి ఎంహెచ్ ఓ మాట్లాడుతూ జిల్లాలో అంటువ్యాధులు ప్రబలకుండా 19 వాహనాల ద్వారా సిబ్బందిని అప్రమత్తం చేశామని తెలిపారు. టీములుగా కూడా ఏర్పాటు చేశామని, ప్రతీ ఇంటికి వెళ్లి ఆరోగ్య సూత్రాలు తెలియజేయాలని సూచించామని పేర్కొన్నారు. ఆమె వెంట జిల్లా మలేరియా అధికారి డాక్టర్ ఎం రాధోడ్, హెల్త్ ఎడ్యుకేటర్ సిహెచ్ కృష్ణమోహన్, గుడివాకలంక వైద్యాధికారి డాక్టర్ ఆర్ గంగాభవానీ, ఎంపిహెచ్ ఇవో బివి ఆర్ వర్మ, గ్రామ కార్యదర్శి సిహెచ్ అనిల్‌కుమార్, వైద్య ఆరోగ్య శాఖ సూపర్‌వైజర్లు ఎస్‌కె సూర్జాన్, ఎం రమేష్‌బాబు, ఎ నాగమల్లేశ్వరరావు, హెచ్‌వి డి అరుంధతీ, టీమ్ మెంబర్లు నల్లా అప్పారావు, గోవిందరాజు, ఎం శారా తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో మైక్ ద్వారా ఆరోగ్య సూత్రాలపై అవగాహన కల్పించారు. అంటువ్యాధులు ప్రబలకుండా ప్రతీ కుటుంబం కూడా అప్రమత్తంగా వుండాలని సూచించారు. మాదేపల్లితో పాటు పెరవలి మండలం కాకరపర్రులో కూడా డెంగూ వ్యాధి గ్రస్తులు వున్నట్లు డి ఎం హెచ్ ఓ తెలిపారు.