పశ్చిమగోదావరి

ఎవరి విధులు వారే నిర్వర్తించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, సెప్టెంబర్ 26 : జిల్లాలోని వివిధ శాఖల్లో దివ్యాంగుల కోటాలో ఉద్యోగాలు పొందిన వారు తమ విధులను తామే నిర్వర్తించాలని కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ స్పష్టం చేశారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం మీ-కోసం కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలుపొందిన కొంతమంది వికలాంగులు వారికి బదులు వేరొకరితో పనిచేస్తున్నారన్న సమాచారం అందుతోందని, అయితే దీన్ని ఎంత మాత్రం సహించేది లేదని, ఎవరైతే ఉద్యోగాలు పొందారో వారే విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు. పెంటపాడు మండలం కె పెంటపాడు గ్రామానికి చెందిన కాకల రామారావు ఫిర్యాదు ఇస్తూ గ్రామంలో వున్న మంచినీటి చెరువు గట్టును కొంతమంది ఆక్రమించుకుని నివాసాలు నిర్మించుకోవడంతోపాటు మరుగుదొడ్లు కూడా కట్టుకోవడంతో డ్రైనేజీలు తవ్వడానికి వీలు లేకుండా చేశారన్నారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ వెంటనే ఈ విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలని డిపివోను ఆదేశించారు.
ఉంగుటూరు మండలం తల్లాపురం గ్రామంలోని కైకరం గ్రామ రెవిన్యూ పరిధిలో 1.65 ఎకరాల ఆక్రమణ భూములను పేద రైతులకు ఇళ్ల స్థలాలుగా మంజూరు చేయాలని కారుమళ్ల వెంకటరత్నం, పోతురాజుల కోటేశ్వరరావు, జి శేఖర్ తదితరులు కలెక్టర్‌ను కోరారు. దీనిపై పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ ఎస్ ఇని ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు, జెసి-2 షరీఫ్, డి ఎస్‌వో శివశంకర్‌రెడ్డి, హౌసింగ్ పిడి ఇ శ్రీనివాసరావు, డ్వామా పిడి వెంకటరమణ, డి ఆర్‌డి ఏపిడి శ్రీనివాసులు, వ్యవసాయ శాఖ జెడి సాయి లక్ష్మీశ్వరి, ఆర్ అండ్ బి ఎస్‌ఇ నిర్మల తదితరులు పాల్గొన్నారు.